భాగ్యనగర మణిహారంగా మారబోతున్న తీగల వంతెన...!

హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెన ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది.వంతెనను ప్రారంభించేందుకు ప్రభుత్వం తేదీని కూడా ఖరారు చేసింది.ఈ నెల 18వ తేదీన దుర్గం చెరువు తీగల వంతెనతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నం.45 ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో వెల్లడించారు.ఈ మేరకు వంతెనకు సంబంధించి రాత్రిపూట తీసిన వీడియోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.అనంతరం వంతెన నిర్మించిన ఇంజినీర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.

 Cable Bridge On Durgam Cheruvu Looks Beautiful,hyderabad, Durgamma Bridge, Engin-TeluguStop.com

స్వచ్ఛమైన గాలిని అందించేందుకు వంతెన చుట్టుపక్కల మొక్కలను నాటారు.రాత్రిపూట మిరుమిట్లు గొలిపే వెలుగుల మధ్య సందర్శకులను ఆకట్టుకునేలా రంగురంగుల విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఈ వంతెన నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో దీనిని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకోరావడానికి ప్రయత్నాలు చేస్తోంది.ఇక ఈ వంతెన నిర్మాణంతో ప్రయోజనం చేకూరే ప్రాంతాల విషయానికి వస్తే… దుర్గం చెరువు వంతెన నిర్మాణంతో బంజారాహిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మదాపూర్ వెళ్లే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ట్రాఫిక్ ని నియంత్రించే క్రమంలో, టూరిస్ట్ ప్లేస్ మార్చేందుకు ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించింది.ఈ వంతెన వల్ల బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే వాహనదారులకు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు జర్నీతో పాటు పెట్రోల్ ఆదా అవుతుంది.

ఇక ఈ వంతెన ప్రత్యేకతలు చూస్తే .ఈ తీగల వంతెనను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ నిర్మించింది.దీని మొత్తం పొడవు 764.38 మీటర్ల వరకు ఉంటుంది.ఇందులో ప్రత్యేకంగా కేబుల్ స్టే బ్రిడ్జి పొడవు 425.85 మీటర్ల వరకు ఉంటుంది.వంతెనకు ఇరువైపులా ర్యాంపులను ఏర్పాటు చేశారు.పాదాచారులకు సౌకర్యంగా 3 మీటర్ల మేర ఫుట్ పాత్ ను కూడా నిర్మించారు.వంతెనలో క్యారేజ్ వే వెడల్పు 18 మీటర్ల (ఆరు లేన్లు) వరకు ఉంటుంది.ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.184 కోట్లు ఖర్చు అయిందని ప్రభుత్వం పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube