డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతున్న పాయల్ రాజ్ పుత్

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.మొదటి సినిమాతోనే అటు యాక్టింగ్ లో, ఇటు హాట్ సోయగాలతో ఒరగాదీసిన ఈ అమ్మడుకి తెలుగులో భాగానే అవకాశాలు వస్తాయని అందరూ గ్రహించారు.స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని అందరూ భావించారు.అనుకున్నట్లుగానే ఈ భామ తన నెక్స్ట్ సినిమాలలో రవితేజ, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టింది.

 Payal Rajput Own Dubbing For Narendra Movie, Jayanth C. Paranjee, Tollywood, Nar-TeluguStop.com

అయితే ఆ సినిమాలలో పాయల్ కి అదిరిపోయే ఇమేజ్ తీసుకొచ్చెంత గొప్ప పాత్రలు అయితే దక్కలేదు.ఏదో అలా సెకండ్ హీరోయిన్ రోల్స్ కి పరిమితం అయిపొయింది.

ఇక సోలోగా ఆర్డీఎక్స్ అంటూ వచ్చిన కూడా అమ్మడుకి వర్క్ అవుట్ కాలేదు.పాయల్ లో పెర్ఫార్మెన్స్ కంటే గ్లామర్ నే దర్శకులు ఎక్కువగా చూస్తున్నారు.

ఈ కారణంగానే ఆమె పెర్ఫార్మెన్స్ కి తగ్గ పాత్రలు ఇవ్వడం లేదు.అయితే ప్రస్తుతం ఈ భామ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి జయంత్ సి పరాన్జీ లాంటి స్టార్ దర్శకుడు సినిమా ఒకటి కావడం విశేషం.

ఇదిలా ఉంటే నరేంద్ర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా ఓ కొత్త కుర్రాడు పరిచయం అవుతున్నాడు.

హాట్ బాంబ్ పాయల్ రాజ్ పుత్ తొలిసారిగా ఈ సినిమా కోసం తన గొంతు సరి చేసుకుంటుంది.నార్త్ ఇండియా భామలు ఎక్కువగా డబ్బింగ్ చెప్పడానికి ప్రాధాన్యత ఇవ్వరు.

అయితే ఈ మధ్య కాలంలో బాష ఏదైనా సొంత గొంతు వినిపించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఈ నేపధ్యంలో నరేంద్ర సినిమాలో మొదటి సారి తెలుగులో డబ్బింగ్ చెప్పే అవకాశం పాయల్ కి వస్తుంది.

ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్ పోషిస్తున్న పాత్ర రీత్యా హిందీ, తెలుగు మిక్సింగ్ ఉంటుంది.ఈ కారణంగానే దర్శకుడు పాయల్ తో చెప్పించడానికి రెడీ అయ్యాడు.

ఇదిలా ఉంటే తెలుగులో డబ్బింగ్ చెప్పాలనేది నా కోరిక, అది ఈ సినిమాతో నెరవేరింది అని పాయల్ రాజ్ పుత్ తాను నరేంద్ర సినిమాకి డబ్బింగ్ చెబుతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube