డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. ఆస్తమా రోగులకు శాపంగా మారనున్న కరోనా!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.ఎన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది.

 Corona Effect On Asthama Patients  Who Warning, Corona Virus, Covid-19, Asthma P-TeluguStop.com

దీంతో ప్రపంచ దేశాలు మొత్తం వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డాయి.అయితే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇక ఈ కరోనా విషయంలోనే డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరికలు జారీ చేసింది.

ఆస్తమా ఉన్నవాళ్లకు రానున్న రోజుల్లో కరోనా శాపంగా మారనుందని, రానున్న రోజుల్లో ఎండ తీవ్రత తగ్గి చలి మొదలుకానుంది.అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి.

దానికి అనుగుణంగానే దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా పంజా విసిరింది.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే భారతదేశంలో ఈ వైరస్ వ్యాప్తి అంతగా ఉండకపోవచ్చని అంచనా వేశారు.

కానీ అవన్నీ అపోహలేనని కరోనా వైరస్ నిరూపించింది.ప్రపంచంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న దేశాలతో పోటీపడుతూ భారతదేశం రెండో స్థానంలో నిలిచింది.

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న తరుణంలో మరణాల రేటు తక్కువగా ఉండడం కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది.వచ్చే చలికాలంలో ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా అలాంటి వారికి శ్వాసకోశకు సంబంధించినటువంటి సమస్యలు అధికమవుతాయి.మరి అలాంటి వారికి ఈ కరోనా వైరస్ వ్యాపిస్తే వారిలో సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి అంటున్నారు.

ముందుగా ఈ వైరస్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది.దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కొన్నిసార్లు ప్రాణాలను సైతం కోల్పోవలసి వస్తుంది.మరి ఈ చలికాలంలో ఆస్తమా రోగులు మరిన్ని నివారణ చర్యలు పాటిస్తూ, అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి రావాల్సిందిగా డబ్ల్యూహెచ్ఓ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube