తమన్ కాపీ ఆరోపణలపై దర్శకుడు ఇంద్రగంటి క్లారిటీ

టాలీవుడ్ లో స్టార్ సంగీత దర్శకుడుగా తమన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.స్టార్ హీరోల సినిమాలకి వర్క్ చేస్తున్నాడు.

 Indraganti Support To Taman Music, Tollywood, V Movie, Telugu Cinema, Music Dire-TeluguStop.com

తన పాటలతో దర్శకులని, నిర్మాతలని, హీరోలని మెప్పిస్తున్నాడు.అయితే ఆడియన్స్ మాత్రం తమన్ పాటలపై, మ్యూజిక్ పై ఎప్పుడూ కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఎక్కువగా పాటలు ట్యూన్స్ కాపీ చేస్తారని, అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్స్ కూడా వేరొక చోట నుంచి లేపెస్తారని ఆరోపిస్తూ ఉంటారు.అలాగే తమన్ చేసిన సినిమా సాంగ్స్ కి ఒరిజినల్ సాంగ్స్ అంటూ పాత పాటలు, ట్యూన్స్ వినిపిస్తూ ఉంటారు.

సోషల్ మీడియాలో అతని ప్రతి సినిమా విషయంలో ఇలాంటి కాపీ క్యాట్ ఆరోపణలతో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.తన కెరియర్ లో బెస్ట్ సాంగ్స్ ఇచ్చిన అల వైకుంఠపురంలో సినిమా విషయంలో కూడా తమన్ పై కాపీ ఆరోపణలు వచ్చాయి.

ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన వి సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సోషల్ మీడియాలో తమన్ పై మరోసారి ట్రోల్స్ నడుస్తున్నాయి.

అయితే ఈ ఆరోపణలపై తమన్ చాలా సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కాని సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగలేదు.అయితే వి సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో వస్తున్న కాపీ ఆరోపణలపై దర్శకుడు ఇంద్రగంటి తాజాగా స్పందించారు.

అన్న‌పూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజ‌నీర్లు కూడా ఆల్‌రెడీ ఉన్న మ్యూజిక్‌నే వాడుతున్నారేంటి? అని అడిగారు.నిజానికి రాక్ష‌స‌న్‌లో వ‌చ్చే బీజీఎమ్, విలో థ‌మ‌న్ వాడిన బీజీఎమ్ రెండూ ఒకేలా క‌నిపించినా అది వేర్వేరు.

కాక‌పోతే మ‌న‌వాళ్ల‌కు సంగీత ప‌రిజ్ఞానం లేక‌పోవ‌డంతో కాపీ అంటున్నారు.ఈ ఒక్క సినిమానే కాదు వేరే సినిమాల్లో కూడా సంగీత ద‌ర్శ‌కులు కాపీ కొట్ట‌క‌పోయినా వారిపై కాపీ నింద‌లు వేస్తారు.

ఒక సౌండ్స్ కి ఒకేరకమైన వాయిద్యం ఉపయోగించడం వలన అలా అనిపిస్తుంది కాని అది కాపీ కాదు.థ‌మన్ ఎంతో ప్ర‌తిభావంతుడు.అతనికి కాపీ చేయాల్సిన అవసరం లేదు అని ఇంద్రగంటి క్లారిటీ ఇచ్చారు.దర్శకుడు ఇచ్చిన వివరణపై తమన్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube