బిగ్‌బాస్ 4: ఫ‌స్ట్ వీక్ ఎలిమినేషన్‌ ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో...!

ఎట్ట‌కేల‌కు బిగ్‌బాస్ 4 వ సీజ‌న్ 16 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైంది.ఓ వైపు క‌రోనా ఉన్నా కూడా మ‌న స్టార్ మా చాలా డేరింగ్ స్టెప్ వేసి కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ షోను ర‌న్ చేస్తోంది.

 Diwi And Surya Kiran Elimination In First Week  Nagarjuna, Diwi, Surya Kiran, Ga-TeluguStop.com

కంటెస్టెంట్ల‌ను ముందుగా క్వారంటైన్‌లో ఉంచ‌డంతో ఎవ్వ‌రికి ఏ ఇబ్బంది లేదు.ఇక హోస్ట్ నాగార్జున షోను తొలి రోజు ర‌క్తి క‌ట్టించేందుకు త‌న వంతుగా ప్ర‌య‌త్నించాడు.

ఇక మూడు రోజుల‌కే కంటెస్టెంట్ల మ‌ధ్య కోట్లాటాలు, క‌న్నీళ్లు, కామెడీలు, సెటైర్ల‌తో షో బాగానే న‌డుస్తోంది.తొలి రోజుతో పోలిస్తే రెండు, మూడు రోజుల్లో వ్యూయ‌ర్‌షిఫ్ పెరిగింద‌ని అంటున్నారు.

ఇక తొలి వారం ఎలిమినేష‌న్లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు.వీరిలో ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న‌దానిపై అప్పుడే సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది.తొలి వారం ఎలిమినేష‌న్ల‌లో ఉన్న వారిలో హీరో అభిజిత్, డైరెక్ట‌ర్ సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా దిల్ సే, జోర్దార్ సుజాత ఉన్నారు.ఇక ఎవ‌రికి వారు బ‌య‌ట త‌మ ఆర్మీల‌తో ముందుగానే క్యాంపెయిన్లు స్టార్ట్ చేశారు.

ఇక తొలి వారం ఎలిమినేష‌న్ల‌లో ఉన్న వారిలో సోష‌ల్ మీడియాలో న‌డుస్తోన్న పోలింగ్‌, ట్రెండ్స్‌ను బ‌ట్టి చూస్తే గంగవ్వ, అభిజిత్, మెహబూబ్ దిల్ సే ఓటింగ్ ప‌రంగా ముందున్నార‌ట‌.అంటే ఈ ముగ్గురు సేఫ్ అయిన‌ట్టే.

ఇక మిగిలిన వారిలో అఖిల్, దివి, సుజాత, సూర్యకిరణ్‌లకు ఓ మోస్త‌రు ఓట్లు ప‌డ్డాయంటున్నారు.ఈ న‌లుగురిలో కూడా చివ‌రి రెండు స్థానాల్లో సూర్య‌కిర‌ణ్, దివి ఉన్నార‌ట‌.

ఈ ఇద్ద‌రిలో మూడు రోజుల్లో అస‌లు దివి షోలో ఉందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి.ఇక సూర్య కిర‌ణ్ ప్ర‌తిదాంట్లోనూ దూరేసి త‌న మాటే నెగ్గాల‌న్న పంతంతో ఉండ‌డంతో ఆయ‌న ముందే అంద‌రికంటే మైన‌స్ అయ్యాడంటున్నారు.

మ‌రి ఈ ఇద్ద‌రిలో ఎవ‌రైనా బ‌య‌ట‌కు వ‌స్తారా ?  లేదా చివ‌రి మూడు రోజుల్లో అంచ‌నాలు త‌ల్ల‌కిందులు అవుతాయా ? అన్న‌ది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube