శారీరక వికలాంగురాలిగా మారబోతున్న సమంత

స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలు చేస్తుంది.అయితే గతంలో మాదిరి కమర్షియల్ సినిమాలు అంటూ పరుగులు పెట్టకుండా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలని ఎంచుకుంటూ ముందుకి వెళ్తుంది.

 Samantha Ready To Play Physically Handicapped Role, Kollywood, Tollywood, South-TeluguStop.com

పెళ్లి తర్వాత ఆమె చేసిన రంగస్థలం సినిమాలో సమంత పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.అలాగే లేడీ ఒరియాంటెడ్ కథాంశంతో వచ్చిన ఓ బేబీ సినిమాలో సమంత వన్ మెన్ షోతో సినిమా మొత్తం నడిపించింది.

ఆ సినిమా ఆమె కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పాలి.ఆ సినిమా తర్వాత కెరియర్ కి కొంత గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ లో నటిస్తుంది.

ఈ పాత్ర తనకి ఎంతో సంతృప్తి ఇచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.సినిమాలతో పాటు మరో వైపు అమ్మడు బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కెరియర్ లో డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్న సమంత ఇప్పటి వరకు కనిపించని విధంగా తన కొత్త సినిమాలో కనిపించడానికి రెడీ అవుతుంది.అది కూడా డీగ్లామర్ రోల్ కనిపించడంతో పాటు పెద్ద సాహసాన్నే చేయనుంది.

మూగ, బధిర యువతిగా నటించడానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోంది.అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో సమంత ఇలా మూగ, బధిర యువతిగా కనిపించనుంది.

గతంలో మయూరి, గేమ్ ఓవర్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు అశ్విన్ ఇప్పుడీ చిత్రాన్ని హారర్ కథాంశంతో రూపొందించనున్నాడని తెలుస్తోంది.మరి రంగస్థలంలో రామ్ చరణ్ చేసిన పాత్ర తరహాలో తన కొత్త సినిమాలో కనిపించడానికి రెడీ అవుతున్న సమంత డైలాగ్ లేకుండా నటనతో ఎంత వరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube