వర్ణ వివక్షపై గెలిచి..దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు సీఈవో బాధ్యతలు: భారత సంతతి మహిళ ప్రస్థానం

పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంతో పాటు జాతి వివక్ష ఆరోపణలను ఎదుర్కొంటున్న క్రికెట్ దక్షిణాఫ్రికా.భారత సంతతికి చెందిన కుగాండ్రీ గోవెందర్‌‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.ఈమె ఇటీవల క్రికెట్ దక్షిణాఫ్రికాకు తాత్కాలిక సీఈవోగా నియమితులయ్యారు.ఇద్దరు కుమార్తెల తల్లి అయిన కుగాండ్రీ తాను ఇంత స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు.

 At Critical Time, Indian-origin Cricket South Africa Boss Takes Strike, Cricket-TeluguStop.com

డర్బన్ నుంచి జోహెన్నెస్‌బర్గ్‌కు రావడానికి 22 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులను ఒప్పించడానికి ఎంతో శ్రమించానని ఆమె గుర్తుచేసుకున్నారు.వర్ణ వివక్షానంతర కాలంలో భారతీయులకు అక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పరిమితంగానే ఉండేది.

అయితే కుగాండ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు.

తాను ఒక సాధారణ భారతీయ ఇంటిలో పెరిగానని చెప్పారు.

ఆ రోజుల్లో కెరీర్ పరంగా తాను ఏం చెప్పినా తల్లిదండ్రులు ‘‘ నో ’’ అనేవారని కుగాండ్రీ వెల్లడించారు.తన తల్లి కనీసం పాఠశాల విద్య పూర్తి చేయకపోయినా తెలివైన మహిళ అన్నారు.

దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో భారతీయ కుటుంబాలను వేరుగా ఉంచేందుకు ఏర్పాటు చేసిన చాట్స్‌వర్త్‌ టౌన్‌షిప్‌లో కుగాండ్రీ పెరిగారు.భారత సంతతి వారి కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో చదువుకున్నారు.

అలాగే వీరు అక్కడి స్థానిక ఆఫ్రికన్లతో మాట్లాడటం నిషేధం.కేవలం భారతీయులతో మాత్రము సన్నిహితంగా మెలగాలి.

Telugu Critical Time, Cricketafrica, Indianorigin-Telugu NRI

తాత షణ్ముగన్ గోవెందర్‌కు డర్బన్‌కు సమీపంలో వున్న పొలంలో తాను ఎక్కువ సమయం గడిపేదాన్నని కుగాండ్రీ గుర్తుచేసుకున్నారు.తన ముత్తాత మద్రాస్ నుంచి కార్మికుడిగా వచ్చి డర్బన్‌లోని చెరుకు పొలాల్లో పనిచేశారని.ఎన్నో సంవత్సరాలు కష్టపడి భూమిని కొనుగోలు చేశారని ఆమె చెప్పారు.వివాహం అయ్యే వరకు తన తల్లి ఆ పొలంలో పనిచేసిందని కుగాండ్రీ గుర్తుచేసుకున్నారు.ఇకపోతే తన ఇద్దరు సోదరులు క్రికెట్ ఆడటాన్ని చూస్తూ పెరిగిన తనకు తెలియకుండానే ఆ ఆటపై ఇష్టం పెరిగిందని తెలిపారు.యూనివర్సిటీలో చదివే రోజుల్లో డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో వాలంటీర్‌గా సేవలందించారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న మహిళా నేతల నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందుతానని కుగాండ్రీ పేర్కొన్నారు.న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా మాజీ ప్రథమ మహిళా మిచెల్ ఒబామా, డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పారు.

సీఈవోగా తాను చేయవలసిన పనుల్లో స్పాన్సర్‌లతో సంబంధాలను చక్కదిద్దడం, పారదర్శకతను తీసుకురావడం అతి ముఖ్యమైనవని కుగాండ్రీ వెల్లడించారు.దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో క్రికెట్ శక్తిని తాను బలంగా విశ్వసిస్తానని ఆమె పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా క్రికెట్ సారథిగా కుగాండ్రీ రోజుకి 17 గంటలు పనిచేస్తున్నారు.అయితే ప్రస్తుతం క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న గ్రేమ్ స్మిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలపై అప్పటి ఫాస్ట్ బౌలర్ మఖాయ ఎన్తిని చేసిన వ్యాఖ్యలు దక్షిణాఫ్రికా బోర్డులో కలకలం రేపాయి.

వీటన్నింటిని చక్కదిద్ది, బోర్డును తిరిగి గాడిలో పెట్టాలని ఆమె భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube