భారతదేశంలో చివరి గ్రామం ఇదే... ఈ గ్రామం ప్రత్యేకతలివే?

దేశానికి సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకోవాలనే కూతూహలం మనలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది.భారతదేశంలో చివరి గ్రామం ఏది…? అనే ప్రశ్న ఎదురైతే మనలో చాలామందికి ఆ ప్రశ్నకు సమాధానం తెలియదు.మరి కొంతమంది దేశంలో చివరి గ్రామం ఉంటుందా…? అని ఎదురు ప్రశ్నలు వేస్తారు.అయితే మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చమోలి జిల్లాలోని మనా గ్రామంను చివరి గ్రామం అని పిలుస్తారు.

 India Last Village Mana Specialties, Mana Village, Welcome To India Last Village-TeluguStop.com

లాస్ట్ ఇండియన్ విలేజ్ గా ప్రఖ్యాతి గాంచిన మనా గ్రామం సముద్రమట్టానికి దాదాపు 3200 మీటర్ల ఎత్తులో ఉంది.డ్రాగన్ సరిహద్దుకు సమీపంలోనే ఉన్న ఈ గ్రామానికి దేశంలోని ఇతర గ్రామాలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

మనా గ్రామానికి ఎంటర్ అయ్యే సమయంలో నే “వెల్ కం లాస్ట్ ఇండియన్ విలేజ్” అనే బోర్డు దర్శనమిస్తుంది.మనా గ్రామంలో ఎవరు ఏ వస్తువును కొనుగోలు చేసినా ఆ వస్తువులపై చివరి గ్రామం అని రాసి ఉంటుంది.

ఇలా చివరి గ్రామం అని రాసి ఉన్న వస్తువులను మనా గ్రామం గుర్తుగా దాచుకోవచ్చు.పురాణాల్లో సైతం మనా గ్రామం ప్రస్తావన ఉండటం గమనార్హం.

పాండవులు మనా గ్రామం నుంచే స్వర్గానికి వెళ్లినట్లు ఇక్కడి గ్రామస్థులు చెబుతుంటారు.వేదవ్యాసుడి వేదాలను రచించారని చెప్పే వ్యాసగుహ, భీముడు సరస్వతీ నదిని దాటడం కొరకు నిర్మించిన రాతి వంతెన, సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే నీలకంథ పర్వతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

వీటితో పాటు అగ్ని దేవుని నివాస స్థలమైన తప్త్ కుండ్ కూడా ఇక్కడే ఉండటం గమనార్హం.బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి సమీపంలోనే ఈ గ్రామం ఉండటం గమనార్హం.పర్యాటకులను మనా గ్రామంలోని ప్రకృతి అందాలు ఆకర్షిస్తాయి.ఎవరైనా కుటుంబ సభ్యులతో కలిసి మంచి పర్యాటక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే మనా గ్రామాన్ని ఎంచుకుంటే తక్కువ బడ్జెట్ తోనే అధ్యాత్మిక ప్రదేశాన్ని చూసి రావచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube