టీచర్ అవతారమెత్తిన కరాటే కళ్యాణి.. గాలి మొత్తం తీసేసిన గంగవ్వ!

వ‌ర‌ల్డ్‌‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్ ‌బాస్ సీజ‌న్ 4.సెప్టెంబ‌ర్ 6 నుంచి ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.మొత్తం 16 మంది సభ్యులు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వ‌గా.బుల్లితెర‌పై సందడి షురూ అయింది.ముఖ్యంగా 16 మంది ఇంటి స‌భ్యుల్లో మోస్ట్ స్పెష‌ల్ కంటెస్టెంట్ గంగ‌వ్వ ఇంట్లో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి త‌న‌దైన మాట‌ల‌తో నువ్వులు పువ్వులు పూయిస్తున్నారు.మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా గంగ‌వ్వ‌కు అభిమానులు ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నారు.

 Gangavva Bigg Counter To Karate Kalyani In Bigg Boss! Gangavva, Bigg Counter, Ka-TeluguStop.com

ఇక బిగ్ బాస్ హౌస్‌లో మొద‌టి వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ కూడా పూర్తి అయింది.ఈ వారం ఎలిమినేష‌న్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు ఉన్నారు.

ఇదిలా ఉంటే.ఈ రోజు ప్ర‌సారం కానున్న షో ప్రో‌మోను స్టార్ మా విడుద‌ల చేసింది.

ఈ ప్రోమోలో బిగ్ బాస్ టీచ‌ర్ టాస్క్ ఇవ్వ‌గా. కరాటే కళ్యాణి బెత్తం ప‌ట్టుకుని పాఠాలు చెప్పేందుకు టీచర్ అవతారమెత్తింది.

మిగిలిన ఇంటి స‌భ్యులు సూడెంట్స్‌గా క‌నిపించనున్నారు.ఈ క్ర‌మంలోనే కరాటే కళ్యాణి గంగ‌వ్వ‌తో.అవ్వ నువ్వు యాబై ఏళ్ల నుంచి ఇదే స్కూల్‌లో ఉంటున్నావ్ కదా అని కామెంట్ చేయడంతో వెంటనే మిగిలిన ఇంటి స‌భ్యులంద‌రూ.న‌వ్వుకుంటూ అవ్వ ఇన్నేళ్ల నుంచి ఫెయిల్ అవుతున్నావా? అంటూ టీజ్ చేస్తారు.టీజ్ చేస్తే మ‌న అవ్వ ఊరుకుంటుందా ఏంటీ.త‌న‌దైన శైలిలో క‌రాటే క‌ళ్యాణి గాలి మొత్తం తీసేసింది.

ఈ క్ర‌మంలోనే గంగ‌వ్వ‌.జీతం జీతమే తీసుకుంటున్నావ్.

ఇట్లనే అందరినీ ఫెయిల్ చేస్తున్నావ్.పిచ్చాసుపత్రి లెక్క చేత్తానవ్ అంటూ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది.

ఇక గంగ‌వ్వ‌కు కౌంట‌ర్‌కు మిగిలిన ఇంటి స‌భ్యులంద‌రూ తెగ న‌వ్వుకున్నారు.ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చెయ్యాలిసిందే.

మ‌రోవైపు, నామినేష‌న్స్‌లో ఉన్న గంగ‌వ్వ‌ను సేవ్ చేసేందుకు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ర‌చ్చ చేస్తున్నారు అభిమానులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube