శివుని కంఠం నీలి రంగులో ఎందుకు ఉంటుందో తెలుసా?

శివుడు.హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన దేవుడిగా శివుడుని భావిస్తారు.మనం పుట్టినప్పటి నుంచి శివుడి కథలు వింటూ ఉంటాం.గొప్ప శక్తులు కలిగినటువంటి పరమశివుడి కంఠం ఎందుకు నీలి రంగులో ఉంటుందో తెలుసా? దాని వెనుక అసలు అర్ధం ఏంటో మీకు తెలుసా?.

 Interesting Reasons Why Lord Shivas Throat To Be Blue Interesting Reasonsm, Lord-TeluguStop.com

పురాణాల ప్రకారం దేవతలకు అసురులే శత్రువులు.అయితే ఒకానొక సమయంలో రాక్షసులతో కలిసి క్షీరసాగర మథనం చేస్తారు.

సముద్రం దిగువ నుండి వచ్చే అమృతాన్ని పొందడానికి, దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనాన్ని చిలుకుతారు.అయితే సముద్రంలో నుంచి మొదట కామధేనువు వస్తుంది.

దానిని వశిష్ఠ దేవుడు తీసుకుంటారు.

తరువాత కల్పవృక్షం వస్తే, దానిని దేవేంద్రుడికి ఇచ్చారు.

ఇలా సాగర మథనం చేస్తూ ఉండగా.విషం బయటకు వస్తుంది.

దానిని దేవతలు మరియు రాక్షసులు తీసుకోవడానికి ఎవరూ ముందుకురారు.దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి వెళ్లి ఆ పరమేశ్వరుడిని వేడుకుంటారు.

అయితే తనను నమ్మిన వారికి సహాయం చేయాలని పరమేశ్వరుడు ఆ విషాన్ని తాగుతాడు.అయితే ఆ విషాన్ని శివుడు మింగకుండా అలాగే తన కంఠంలోనే ఉంచుకుంటాడు.

అలా తన కంఠంలో విషం ఉండడం వల్ల తన గొంతు నీలంగా మారుతుంది.అందుకే పరమేశ్వరుడిని నీలకంఠేశ్వరునిగా పిలుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube