జూనియర్ ఎన్టీఆర్ ఆఖరి సినిమా అదేనట!

జూనియర్ ఎన్టీఆర్.ఈ పేరు వింటే చాలు ఎందరో అభిమానులు మా అన్న ఎన్టీఆర్ అంటూ వస్తారు.

 Ntr Last Film With Rajamouli , Rajamouli Next With Mahesh Babu, Ntr, Rajamouli,-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పేరుకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే అభిమానులు ఎగిరి గంతేస్తారు.

అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ అప్పుడే ఆఖరి చిత్రం అని చెప్పడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? .

అక్కడికే వస్తున్న.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా అయినా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు.అయితే ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చింది రాజమౌళినే.

రాజమౌళితో తీసిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి.ఇప్పటికే రాజమౌళితో కలిసి మూడు సినిమాలు చేశాడు.

స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ.ఈ మూడు సూపర్ డూపర్ హిట్.

Telugu Maha Baratham, Maha Bharatham, Mahesh Babu, Ntr Rajamouli, Rajamouli, Raj

ఇక నాలుగో చిత్రమే ఆర్ఆర్ఆర్.ఈ సినిమానే రాజమౌళితో చేసే ఆఖరి సినిమా అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట వైరల్ అవుతుంది.అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.రాజమౌళి ఏ సినిమా చేసిన చాలా టైమ్ తీసుకుంటున్నాడు.ఆరు నెలలు, సంవత్సరం కాకుండా రెండు, మూడు ఏళ్లు టైం తీసుకుంటున్నాడు.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికే దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.ఎప్పుడు షూటింగ్ పూర్తి అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు ఊహించలేరు.ఇక అలానే నెక్స్ట్ మహేష్ బాబుతో మహాభారతం సినిమాను పార్ట్ లు, పార్ట్ లు తియ్యాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడు.మరి ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు.

అలాంటప్పుడు మళ్లీ ఎన్టీఆర్ టర్న్ వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారంకు, ఈ లాజిక్ కి సంబంధం ఉంది.

మరి నిజం ఏంటి అనేది తెలియాలి అంటే చాలానే సమయం పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube