సింగర్ ను చంపేస్తామంటు బెదిరిస్తున్న స్టార్ హీరో ఫ్యాన్స్

బాలీవుడ్ లో ఓ రకమైన విష సంస్కృతి ఉంది.ఒక హీరోని నేను అభిమానిస్తున్న అని ఎవరైనా సెలబ్రెటీలు చెప్పారంటే మిగిలిన హీరోల అభిమానులు సోషల్ మీడియాలో అతనిని టార్గెట్ చేయడం మొదలు పెడతారు.

 Amaal Mallik Receives Death Threats From Salman Khan Fans, Bollywood, Celebrity-TeluguStop.com

దారుణంగా ట్రోల్స్ చేస్తారు.చెప్పుకోలేని మాటలతో దాడి చేస్తారు.

ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ నుంచి ఇలాంటి భయానక పరిస్థితిని చాలా మంది ఎదుర్కొన్నారు.ఇప్పుడు సింగర్ అమల్ మాలిక్ వంతు వచ్చింది.

తాజాగా అతను తనకు హీరో షారుఖ్ ఖాన్ అంటే ఇష్టమని ప్రకటించారు.అయితే నీకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం లేదా అంటూ సల్లూభాయ్ అభిమానులు మాటల దాడి చేయడం మొదలు పెట్టారు.

ఈ వేధింపులు ఎంత వరకు వెళ్లాయంటే చంపేస్తామంటూ కొందరూ నేరుగా బెదిరింపులకి పాల్పడే వరకు వచ్చింది.దీంతో ఈ ఫ్యాన్స్ ట్రోలింగ్ తట్టుకోలేకపోయిన అమల్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించారు.

మీరు నా ప్రొఫైల్‌కు వ‌చ్చి వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు.ఎందుకంటే నేను సల్మాన్ ఖాన్‌కు గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని మీరు భావిస్తున్నారు.నేను ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉన్నాను.అత‌నో సూపర్ స్టార్‌, బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ కూడా.

కానీ నా చిన్న‌ప్ప‌టి నుంచే షారుక్ అంటే ఇష్టం.ఇందులో త‌ప్పేముందో తెలుసుకోవ‌చ్చా.

దీన్ని ప‌ట్టుకుని న‌న్ను చంపుతాం అని బెదిరించే అభిమానులు ఉంటే ఏ హీరో మాత్రం సంతోషప‌డ‌తారు.ఇంత ఘోరంగా ట్రోల్ చేయ‌డం చూసి నేను నిజంగా షాక్ అవుతున్నా.

చ‌దువు రాని ద‌ద్ద‌మ్మ‌లు న‌న్ను ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌చ్చిపోమంటున్నారు.ఇలాగేనా మీ ఫేవ‌రెట్ హీరోకు మ‌ద్ద‌తు చేసే విధానం.

మీ లాంటి చదువు లేని వెధవల నుంచి నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటూ అమల్ ఘాటుగా స్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube