బిగ్ బాస్ 4 పై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు రియాలిటీ షో త్వరలో మొదలు కాబోతుంది.ఇప్పటికే దీనికి సంబందించిన రంగం సిద్ధం అయ్యింది.

 Singer Sunitha Gives Clarity On Bigg Boss 4, Tollywood, Bigg Boss 4 Reality Sho-TeluguStop.com

ఇక ఈ రియాలిటీ షోలో పాల్గొనేవారు వీళ్ళే అంటూ రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి.అయితే వారిలో ఎవరు కరెక్ట్ అనేది మాత్రం స్పష్టత లేదు.

ఇక గత సీజన్ కి వెళ్లిన వాళ్ళు, అలాగే మరికొంత మంది బిగ్ బాస్ షో గురించి విమర్శలు చేస్తూ ఉండటంతో ఈ సారి జరగబోయే సీజన్ మీద చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సారి మరింత కొత్తగా ప్రెజెంట్ చేయడానికి బిగ్ బాస్ టీం రెడీ అవుతుంది.

అయితే ఈ షోలో ఎవరు పాల్గొంటారు అనే విషయం మీద మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.ఈ నేపధ్యంలో సింగర్ సునీత బిగ్ బాస్ 4లో పాల్గొనబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఫైనల్ కంటిస్టెంట్ లిస్ట్ లో ఆమె కన్ఫర్మ్ అయ్యిందని కూడా బలంగా ప్రచారంలోకి వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ ప్రచారంపై సునీత క్లారిటీ ఇచ్చింది.

ఈ మధ్య కాలంలో కరోనా బారిన పడి బయట పడిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో సునీత కరోనాపై జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసింది.

వీటికి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావడంతో వెనక్కి తగ్గింది.ఆమె ఏం చెప్పాలని అనుకున్న నెటిజన్లు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు.

అయితే బిగ్ బాస్ లో పాల్గొంటుంది అని జరుగుతున్న ప్రచారంపై సునీత స్పందించింది.ప్రియమైన మిత్రులారా, నేను బిగ్ బాస్ 4 తెలుగు లో లేను.

భవిష్యత్తులో కూడా అందులో ఉండబోనని, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు.ఆమె ఇచ్చిన క్లారిటీతో సునీత బిగ్ బాస్ లో పాల్గొనడం లేదని స్పష్టత వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube