'ఆదిపురుష్‌' కు ఉదయం 7.11 సెంటిమెంట్‌ ఏంటో?

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ బడ్జెట్‌ ‘ఆదిపురుష్‌’ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది.రామాయణ ఇతివృత్తంతో ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా మోషన్‌ పోస్టర్‌ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Do Youn Konw The Aadhipursh 7.11 Sentiment, Adhipurush, Saifalikhan, Lankesh,pra-TeluguStop.com

నేడు మరో అప్‌ డేట్‌ వచ్చేసింది.సినిమా ప్రకటనల జోరు చూస్తుంటే చాలా స్పీడ్‌ గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు అనిపిస్తుంది.

ఈ సమయంలో ఒక ఆసక్తికర విషయం ఒకటి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ను మరియు నెటిజన్స్‌ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఆదిపురుష్‌ సినిమా ప్రకటన చేసిన రోజు గుర్తుంది కదా ఆ రోజు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ప్రభాస్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ లో పోస్ట్‌ పెట్టి సినిమాను అనౌన్స్‌ చేశాడు.

సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకే ఎందుకు అని ఆ సమయంలో పెద్దగా చర్చ జరగలేదు.కాని నేడు కూడా మరో అప్‌ డేట్‌ ను అదే సమయంకు అంటే 7 గంటల 11 నిమిషాలకు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటీ అనేది తెలియడం లేదు.

ఖచ్చితంగా ఈ 7.11 కు సినిమాకు ఏదో సబందం ఉందేమో అనిపిస్తుంది.లేదా ప్రభాస్‌ లేదా ఓం రౌత్‌ కు ఇది లక్కీ నెంబర్‌ అయ్యి ఉంటుందని కొందరు అంటున్నారు.అయితే ఈ 7.11 ను కూడితే 9 వస్తుంది.కనుక ఆ కారణం వల్ల కూడా ఆ టైంను ఎంపిక చేసుకుని ఉంటారు అంటున్నారు.అయితే 9 అంకె కలిసేలా రావాలంటే 8.1 కి విడుదల చేయవచ్చు లేదంటే సరిగ్గా 9 గంటలకు విడుదల చేయవచ్చు.కాని 7.11 కు విడుదల చేస్తున్నారు అంటే ఏదో ప్రత్యేకత ఉందని ముందు ముందు దాని గురించి దర్శకుడు ఓం రౌత్‌ ఏం చెప్పబోతున్నాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube