ఆ ఊర్లో వారందరూ రాళ్లు అమ్ముకొని లక్షాధికారులయ్యారు... అసలు విషయం ఏమిటంటే...?

నిజంగా ఇది మరెక్కడా జరగని ఒక మహా అద్భుతం.అసలు ఏం జరిగింది…? ఏమిటి ఈ అద్భుతం అని అనుకుంటున్నారా…? మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చదివేయండి.ఈ అద్భుతం బ్రెజిల్‌ లోని, ఈశాన్య ప్రాంతంలో ఉన్న శాంతా ఫిలోమెనా పట్టణం లో జరిగింది.ఈ ప్రాంతంలో ఆగస్ట్ 19న అంతరిక్ష అద్భుతం జరగడం విశేషం.

 Hundreds Of Chunks Of Meteorite Rain Down On Brazilian Town, Brazilian Town, M-TeluguStop.com

అసలేమైందో తెలుసా…? ఇక్కడే వందల కొద్ది రాళ్లు అంతరిక్షం నుంచి పడ్డాయి.ఇంకేం ఉంది చూసిన స్థానికులు వాళ్ల భాషలో… “అరే ఏంటవి, ఇలా జరుగుతోందేంటి వామ్మో”… అనుకుంటూ ఎంతగానో భయపడ్డారు.

కానీ, ఆ తర్వాతే తెలిసింది అవి విలువైన రాళ్లు అని వారికీ.దీనితో అక్కడ జనం ఎంతో పోటీ పడి వాటిని ఏరడం ప్రారంభించారు.

మరో విషయం ఏమిటంటే.ఆ రాళ్ళ విలువ లక్షల్లో ఉంటుందనే అంచనా వేశారు.

అక్కడ పడ్డ ఆ రాళ్ళు సాధారణ రాళ్లు కావు.

మరి అవి ఏమిటి…? ఈ విషయానికి వస్తే….ఎప్పుడో మన సౌర కుటుంబం ఏర్పడిన 460 కోట్ల సంవత్సరాల క్రితంవి ఆ రాళ్లు అని పరిశోధనలో తేల్చారు.అవి ఉల్కలలాగా భూమి పై పడ్డాయి.ఇప్పటి వరకూ మనకు తెలిసిన ఉల్కల్లో ఇలాంటి ఉల్కలు ఒక్క శాతం మాత్రమే ఉన్నాయట.ఆ ఒక్క రాయి దొరికితే చాలు కదా…! లక్షాధికారి అయిపోయినట్టే.

కొన్ని రోజుల కిందట ఆ రాళ్లకు ఉన్న ధరతో పోలిస్తే ధర ఇప్పుడు రెట్టింపు అయ్యింది.ఎందుకంటే ప్రతీ ఒక్కరు ఆ రాళ్లు కావాలని అంటున్నారు.90 శాతం మంది రైతులే ఆ ఊరిలో ఉన్నారు.వాళ్లు రాళ్లు అమ్ముకొని… వాళ్ల అప్పులు తీర్చుకుంటున్నారు.

ఇక అక్కడ దొరికిన 40 కేజీల రాళ్లని కొనేందుకు బ్రెజిల్ ‌లో ఎవరూ ముందుకు రాలేదు.కానీ, ఇక్కడ రూ.19 లక్షలకు కొని… సంపన్న దేశాల్లో దాన్ని రూ.కోట్లకు అమ్మాలనుకుంటున్నారు.ఏది ఏమైనా ఆ రైతుల దశ తిరిగింది అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube