వైరల్ వీడియో: జీతం డబ్బుల కోసం యజమానితో పనిమనిషి గొడవ...!

ఓవైపు ప్రపంచం ఆధునీకరణ విషయంలో రోజురోజుకీ ముందుకు వెళుతుంటే.మరికొందరు నిరక్షరాస్యులు చదువుకోకుండా తెగ ఇబ్బంది పడుతున్నారు.

 Maid Isn't Convinced That Rs 1500 Plus Rs 300 Equals Rs 1800, Maid, Justice For-TeluguStop.com

నిజానికి చదువు రాని వారు ఏదైనా లెక్కలు వేసుకొని ఉన్నప్పుడు తెగ ఇబ్బందులు పడుతుంటారు.ఇక డబ్బుల విషయం కొస్తే సరే సరి… ఒకటికి పది సార్లు లెక్క వేసుకొని సగం కన్ఫ్యూజన్ అయ్యి ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు.

అలాంటి సమయాల్లో వారు పక్క వారు చెబుతున్న గాని, అసలు వినిపించుకోరు.ఇదంతా ఎందుకు అంటే తాజాగా మహారాష్ట్రలో జరిగిన సంఘటన అచ్చం ఇలాంటి ఈ కోవకే చెందినది.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే….

ఓ మహిళా పని మనిషి నెలంతా కష్టపడి తన యజమానితో జీతం ఇప్పించుకునే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

నిజానికి ఆ మహిళకు 1800 రూపాయలు రావాల్సి ఉంది.అయితే ఆమెకు 1800 యజమాని ఇచ్చాడు.అది ఎలా ఇచ్చాడంటే 500 రూపాయల 3 నోట్లు, 200 రూపాయల ఒక నోటు, 100 రూపాయల ఒక నోటు ఇచ్చాడు.ఇలా ఇచ్చినా కూడా… ఆ నిరక్షరాస్య మహిళ తనకు 1800 ఇవ్వలేదని యజమానితో గొడవకు దిగింది.

దాంతో యజమాని పని మనిషి నిరక్షరాస్యతను గ్రహించి తాను ఇచ్చిన మొత్తాన్ని క్షుణ్ణంగా తెలిపాడు.అయినా కానీ ఆమె తనకు 1800 ఇవ్వలేదని తన యజమాని తో వాగ్వివాదానికి దిగింది.

దీంతో యజమానికి మైండ్ బ్లాక్ అయింది.

ఆమె మాటలతో చెప్తే వినటం కుదరకపోవడంతో.

చివరికి క్యాలిక్యులేటర్ తీసుకొని వచ్చి చెప్పినా కూడా ఆమె వినిపించుకోకపోవడం నిజంగా కొసమెరుపు.ఇక సదరు యజమాని చేసేదేమీ లేక చివరికి వారి ఇంట్లో ఉన్న పిల్లలను పిలిపించి ఆమెకి అర్థం అయ్యే విధంగా లెక్క చెప్పించడంతో ఆవిడ చివరికి వారి మాట ఒప్పుకుంది.

అయితే ఈ గొడవ జరిగే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోకి సంబంధించి నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు.

ఇలా నిరక్షరాస్యులైన పనిమనిషిని నెటిజన్లు గేలి చేయడంతో చివరికి మహారాష్ట్ర రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ కూడా స్పందించారు.ఆవిడ లెక్కల్లో పొరపాటు ఎంతమాత్రం జోకు కాదని ట్విట్టర్ పూర్వకంగా అభిప్రాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube