బ్లూ టూత్ ఫోన్ ఛార్జింగ్ ని ఎంత ఖర్చు చేస్తుందంటే?

మనలో మొబైల్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లలో చాలామంది తమకు తెలియకుండానే ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే ఫిర్యాదు చేస్తూ ఉంటారు.అయితే మనం ఫోన్ లో బ్లూ టూత్ ను ఎక్కువ సమయం వినియోగించినా చార్జింగ్ త్వరగా అయిపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

 Does Bluetooth Drains Your Phone Battery, Bluetooth ,wireless Headphones, Phone'-TeluguStop.com

వైర్‌లెస్ టెక్నాలజీకి కచ్చితంగా పవర్ అవసరం అని బ్యాటరీని బ్లూ టూత్ పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఎవరైనా ఈ విషయాలను నమ్మకపోతే బ్లూ టూత్ ఆన్ చేసి కొంత సమయం, ఆఫ్ చేసి కొంత సమయం మొబైల్ ఫోన్ ను పరిశీలిస్తే అసలు నిజం సులభంగా తెలుస్తుందని చెబుతున్నారు.

పరిశోధకులు ఐదు వేరువేరు స్మార్ట్ ఫోన్ కంపెనీలపై రెండు పద్ధతుల ద్వారా పరీక్షలు జరిపి టెస్టింగ్ సాఫ్ట్ వేర్ ద్వారా పనితీరును పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు.మొదటి విధానంలో బ్లూ టూత్ ను ఆఫ్ చేసి పరీక్షించి మరోసారి బ్లూ టూత్ ఆన్ చేసి పరీక్షలు చేశారు.

నెట్ బ్రౌజింగ్ లో కొంత సమయం ఫోన్ ను వాడి కొంత సమయం స్లీప్ మోడ్ లో ఉంచి మరలా కొంత సమయం నెట్ బ్రౌజింగ్ చేసి పరిశోధన ఫలితాలను వెల్లడించారు.ఫోన్ లో బ్లూ టూత్ ను ఆన్ చేసినా ఆఫ్ చేసినా డిశ్చార్జింగ్ లో పెద్ద తేడా ఉండదని అయితే బ్లూ టూత్ కు ఏ డివైజ్ అయినా కనెక్ట్ అయితే మాత్రం బ్యాటరీ డ్రైన్ అయిపోతుందని….ఫోన్ లో ఉన్న బ్యాటరీ కెపాసిటీలో 6.6 శాతం బ్లూటూత్ కే ఖర్చు అవుతున్నట్టు తాము గుర్తించామని టెక్ నిపుణులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube