నయనతారతో డేటింగ్ బోర్ కొడితే పెళ్లి... క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ నయనతార.ఇప్పటికి ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కొనసాగుతుంది.

 Vignesh Gives Clarity To His Marriage With Nayanatara, Vignesh Sivan, Kollywood,-TeluguStop.com

ఇక తమిళనాడులో ఆమె చేస్తున్న సినిమాలకి మంచి మార్కెట్ ఉంది.అక్కడ లేడీ ఒరియాంటెడ్ కథలతో వరుస హిట్స్ కొడుతూ దూసుకుపోతుంది.

మరోవైపు స్టార్ హీరోలతో కూడా ఆడిపాడుతుంది.ఇక ఆమె హీరోయిన్ గా ఎంత గుర్తింపు తెచ్చుకుందో, సినిమా స్టార్స్ తో ప్రేమకథలు నడుపుతూ అంతే గుర్తింపు తెచ్చుకుంది.

కెరియర్ ఆరంభంలో హీరో శింబుతో ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్ళింది.తరువాత ఇద్దరికి బ్రేక్ అప్ అయ్యింది.

తరువాత ప్రభుదేవాతో ఆమె ప్రేమాయణం సాగించింది.నయనతార కోసం ప్రభుదేవా తన భార్యకి కూడా విడాకులు ఇచ్చేశాడు.

తరువాత అతనితో బ్రేక్ అప్ అయ్యింది.ఇప్పుడు దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఆమె చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది.

వీరిద్దరూ త్వరలో పెళ్లిచేసుకుంటారని అనేక రూమర్లు వస్తున్నాయి.

దీనిపై విగ్నేష్ మాట్లాడుతూ ఇప్పటికే మా ఇద్దరికి మీడియా వారు 22 సార్లు పెళ్లి చేశారని, తామిద్దరం సినిమాల పరంగా సాధించాల్సింది చాలా ఉందని, తామిద్దరకి డేటింగ్ లైఫ్ బోర్ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు.

అంటే తాము ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని విగ్నేష్ చెప్పకనే చెప్పారు.తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న తరువాత వారి ఫేమ్ అమాంతం పడిపోతుంది.అందుకే మంచి ఫేమ్ ఉన్న సమయంలో డబ్బు సంపాదించుకొని కాస్త పాపులారిటీ తగ్గిన తరువాత పెళ్లి చేసుకోవాలని నయనతార భావిస్తుందని అనుకుంటున్నారు.ఏది ఏమైనా వీరిద్దరు ఎప్పటికప్పుడు టూర్స్ వెళ్తూ పెళ్లి కాకుండానే భాగా ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube