ఆత్మకథ రాస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో

ప్రస్తుతం బాలీవుడ్ లో దర్శక, నిర్మాతల దృష్టి బయోపిక్ కథల మీద పడింది.నిజ జీవిత కథలని తీసుకొని వాటిని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

 Saif Ali Khan Announces Autobiography, Bollywood, Celebrity Lifestyle, Star Hero-TeluguStop.com

ఇలా తెరపైకి వస్తున్న బయోపిక్ కథలలో చాలా వరకు హిట్ అవ్వుతున్నాయి.దీంతో సౌత్ లో కూడా ఈ ట్రెండ్ కి కనెక్ట్ అవుతున్నారు.

తెలుగులో సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సూపర్ హిట్ అవ్వడంతో అలాగే కొంత మంది ప్రయత్నం చేసిన అవి వర్క్ అవుట్ అవ్వలేదు.అయినా కూడా కొంత మంది సౌత్ లోను బయోపిక్ స్టోరీలు రెడీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో వైపు సెలబ్రిటీలు వారి జీవిత కథలకి అక్షర రూపం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఒకప్పుడు ఆటో బయోగ్రఫీ అనే మాటలు ఎక్కువగా వినిపించేవి.

అయితే తరువాత కాలంలో ఎంత పెద్దవాళ్ళు అయిన కూడా వాళ్ళ ఆటో బయోగ్రఫీలు రాసేందుకు పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు.

ఒకవేళ వచ్చిన కూడా అవి పెద్దగా పాపులర్ అయ్యేవి కాదు.

అయితే ఇప్పుడు సినిమాల ప్రభావం ఈ బయోగ్రఫీల మీద పడింది.దీంతో చాలా మంది సెలబ్రిటీలు వారి నిజ జీవిత అనుభవాలు, ప్రయాణం అంతా పుస్తకంపై పెడుతున్నారు.

ఇప్పుడు ఇదే దారిలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూడా చేరిపోయారు.ఆయన తన జీవిత కథ రాస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

తన ఆత్మకథ గురించి సైఫ్‌ మాట్లాడుతూ రోజులు మారుతున్న కొద్దీ చాలా విషయాలు కూడా మారిపోతున్నాయి.వాటిని ఓ రికార్డెడ్‌గా ఉంచుకోకపోతే చాలా కోల్పోతాం.

నా ఆత్మకథని నేను రాయడం స్వార్థమే.అయితే ఈ పుస్తకాన్ని చదివినప్పుడు నా ఫ్యాన్స్‌ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు.

త్వరలోనే సైఫ్ ఆత్మకథ పుస్తకాన్ని మార్కెట్ లోకి తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది.మరి ఈ ఆత్మకథ ఎంత మందిని ఆకర్షిస్తుంది అనేది వేచి చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube