జీఎస్టీ శ్లాబ్ రేటులో మార్పులు : కేంద్రం

కేంద్రం ప్రభుత్వం ప్రజలకు శుభవార్త వినిపించింది.జీఎస్టీ శ్లాబ్ రేట్లలో కీలక మార్పులు చేసింది.

 Changes In Gst Slab Rate Center Central Governament, Gst, Slab Rate-TeluguStop.com

ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.జీఎస్టీ 28 శాతం శ్లాబ్ రేటు ఉన్న 230 వస్తువులు, సేవల్లో 200 వస్తువులను తక్కువ శ్లాబ్ కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో పాటుగా హౌసింగ్ రంగానికి సంబంధించి 5 శాతం శ్లాబ్ రేటు నిర్ణయించగా.చిన్న ఇళ్లపై 1 శాతానికి జీఎస్టీ కుదించింది.

నిత్యవసర వస్తువులైన హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, సబ్బులు తదితర వస్తువులపై 29.3 శాతం నుంచి 18 శాతం పన్ను రేటును తగ్గించింది.సినిమా టికెట్లపై మొదట్లో 35 శాతం నుంచి 110 శాతం ఉండగా ప్రస్తుతం 12 నుంచి 18 శాతానికి తగ్గించింది.మరికొన్ని నిత్యావసర వస్తువులపై 0-5 శాతం మధ్యలో పన్నును విధించింది.

ఈ ధరలు తర్వలోనే అమలులోని వస్తాయని కేంద్రం పేర్కొంది.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా వరకు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు మరికొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి.

జీఎస్టీ శ్లాబ్ రేటు తగ్గించడంతో నిత్యావసర ధరలు ఇంకా చౌకగా కొనుగోలు చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube