షాకింగ్: కాస్టింగ్ కౌచ్ కామనే అంటున్న స్వీటీ..!

గత రెండు మూడు సంవత్సరాలుగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా ఎక్కువగా వినపడుతోంది.టాలీవుడ్ లో దానికి ఆజ్యం పోయడానికి కారణం మాత్రం శ్రీ రెడ్డే.

 Anushka Shetty About Casting Couch In Tollywood, Anushka, Sweety, Casting Couch,-TeluguStop.com

ఆ క్రెడిట్ మాత్రం ఆమెకే దక్కుతుంది.ఆమె తన స్వార్థం కోసం చేసిందా లేదా సమాజాన్ని ఉద్ధరించడం కోసం చేసిందా అనే విషయం పక్కన పెడితే, దాని వలన టాలీవుడ్ చీకటి కోణాలు చాలా బయట పడ్డాయి.

అయితే దానికి ఓ ఏడాది ముందు కోలీవుడ్ లో ‘సుచి లీక్స్’ పేరిట సింగర్ సుచిత్ర కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలను బయట పెట్టిన సంగతి తెలిసినదే.

ఇక దాని తరువాత వరుసగా ఇలాంటి ఇబ్బందులకు గురయ్యేవారు ధైర్యంగా తమ గళాన్ని విప్పడం స్టార్ట్ చేశారు.

అయితే టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అందాల భామ అనుష్క కూడా కాస్టింగ్ కౌచ్ గురించి పేర్కొంటూ… తాను కూడా ఇలాంటి వేధింపులకు గురయ్యానని, అయితే తనకున్న ముక్కుసూటిత‌నం, ధైర్యం అనే విషయాలు ఎదుటి వారికి భయాన్ని కలగజేసేవని, అందుకే తన పట్ల ఈ రకంగా బిహేవ్ చేయడానికి వారు వెనకడుగు వేసేవారని చెప్పుకొచ్చింది.

Telugu Anushka, Anushkashetty, Nishabdam, Sweety, Tollywood-Movie

ఇకపోతే ఇటీవల నిశ్శ‌బ్ధం సినిమా ప్ర‌మోషన్‌ లో పాల్గొన్న అనుష్క, సదరు జర్నలిస్ట్ అడిగిన కాస్టింగ్ కౌచ్ ప్రశ్నకు స్పందిస్తూ.ముఖ్యంగా సినిమా ఇండీస్ట్రీలో కొత్త‌ వారికి ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని, ఇక్కడ ఇలాంటివి చాలా కామన్ అని, అలా వేధించేవారు ప్రతిచోటా ఉంటారని, అయితే మనమే మన తెలివితో… చాకచక్యంతో తప్పించుకోవాలని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.కానీ అందరికీ అనుష్క అంత ధైర్యం, తెగువ ఉండాలి కదా మరి.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube