వామ్మో.. ఆమె శరీరంలో ఏకంగా 50 కేజీల కణితి.. అసలు ఏమైందంటే...?

చాలామందికి వారికి తెలియకుండానే వారి ఉదరం లో కణతులు ఏర్పడుతుంటాయి.ఇలాంటి విషయమే తాజాగా భారత దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

 50kgs Tumor Found In Woman Stomach,delhi, Tumor, Stomach, Operation, Heavy Weigh-TeluguStop.com

అదికూడా ఏకంగా ఓ మహిళ కడుపులో 50 కిలోల కణతి ని వైద్యులు అతి కష్టం మీద తొలగించారు.ఢిల్లీ మహానగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ అరుదైన చికిత్స జరిగింది.

ఇక అసలు విషయంలోకి వెళితే… ఓ మహిళ శరీరం నుండి ఏకంగా 50 కిలోల కణతిని తొలగించారు వైద్యులు.సదరు మహిళ బరువు 150 కిలోలు ఉండగా అందులో 50 కిలోల బరువు కేవలం తన కడుపులో కణతి ఉంది.52 సంవత్సరాల మహిళ గత కొన్ని నెలలుగా తను ఊహించని విధంగా తన కడుపు అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.అంతేకాదు అప్పుడప్పుడు ఆమె కడుపులో తీవ్రమైన నొప్పి కూడా దారి తీసేది.

కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అయ్యిందని వైద్యులు తెలిపారు.ఆమె పడుకున్నా, నడుస్తున్న నరకం అనుభవించిందని వైద్యులు తెలియజేశారు.

తాజాగా ఆమె ఆపరేషన్ చేసిన తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యింది.దాంతో ఆమెకు రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం కూడా పూర్తిగా పడిపోయిందని వైద్యులు నిర్ధారించారు.

ఆమెకు ఆపరేషన్ చేసే సమయంలో ఏకంగా 6 యూనిట్ల రక్తమార్పిడి చేశామని డాక్టర్లు తెలిపారు.

ఇక ఆపరేషన్ పక్రియలో భాగంగా కొన్ని పద్ధతులను ఉపయోగించి పరికరాలను కడుపులోకి పంపడానికి అసలు స్థలం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు.

దాంతో వారు మల్టీ డిస్సిప్లినరీ బృందంతో కలిసి సంప్రదాయ శస్త్రచికిత్స చేసి కణితి తొలగించినట్లు వైద్య తెలియజేశారు.ఇకపోతే ఇదివరకు అత్యధికంగా ఓ మహిళకు 34 కేజీల కణితిని 2017లో తొలగించారు.

ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలు కొడుతూ మొత్తం 50 కిలోల కణతిని తొలగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube