బిగ్‌బాస్‌లో గంగవ్వ నిజమేనా?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.మరో వారం పది రోజుల్లో షో ప్రారంభం అవుతుందని అంటున్నారు.

 My Village Show Gangavva In Bigg Boss 4, Bigg Boss 4, Gangavva, Nagarjuna, Star-TeluguStop.com

ప్రస్తుతం షోకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ముఖ్యంగా కంటెస్టెంట్స్‌ విషయంలో చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు అవి పతాక స్థాయికి చేరాయి.బిగ్‌బాస్‌ లో వాళ్లు వీళ్లు అంటూ ఇప్పటి వరకు ఎన్నో పేర్లు వినిపించాయి.

ఇప్పుడు వినిపిస్తున్న పేరు మొత్తం షో ఫార్మట్‌ను మార్చే విధంగా ఉంటుదని అంటున్నారు.
మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న గంగవ్వను బిగ్‌బాస్‌ షోలోకి తీసుకోబోతున్నారు.

గతంలో ఇండియా టుడే ఆ తర్వాత ఎన్డీటీవీ ఈమధ్య సీఎన్‌ఎన్‌లో గంగవ్వ గురించిన ప్రత్యేక కథనాలు వచ్చాయి.బిబిసీలో కూడా ఆమెకు స్థానం దక్కింది అంటే ఏ స్థాయిలో ఆమె పేరు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గంగవ్వ మాట్లాడే మాట తీరు మరియు ఆమె బాడీలాంగ్వేజ్‌ మన పక్క వారి మాదిరిగా ఉంటాయి.ఆమె ముందు కెమెరా పెట్టినా కూడా చాలా సహజంగానే ఆమె ప్రవర్తిస్తూ ఉంటుంది.

Telugu Bigg Boss, Gangavva, Show, Showgangavva, Nagarjuna, Maa, Telugu-

పూరి జగన్నాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో ఆమెకు ఛాన్స్‌ ఇచ్చాడు అంటే ఆమె గురించి ఏ స్థాయిలో ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.గంగవ్వ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటీ అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అయితే ఆమె వయసు ఎక్కువగా ఉంటుంది కనుక ఇవన్నీ పుకార్లే అయ్యి ఉంటాయి అంటూ కొందరు అంటున్నారు.మొత్తానికి గంగవ్వ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube