తాజ్‌మహాల్‌ పరిసరాల్లో ఏడడుగుల కొండచిలువ.. చివరికి ఏమైందంటే?

ఇటీవల కాలంలో కొండచిలువలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి.కారణం ఏదైనా కొండచిలువల వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 7 Feet Python At Taj Mahal Courtyard,7 Feet Python,  Courtyard, Taj Mahal, Lockd-TeluguStop.com

మొన్నటికి మొన్న కేరళకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ ఫోటో వెలుగులోకి వచ్చింది.

అది ఏంటంటే? ప్రేమకు చిహ్నం అయిన తాజ్‌మహాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మన భారత్ లో ఒక అద్భుతమైన అందమైన ప్రదేశం ఏంటి అంటే తాజ్ మహల్ ఏ.అలాంటి తాజ్ మహల్ ని చూసేందుకు ఓ కొండచిలువ వచ్చేసింది.ఇది చెప్పడానికి కామెడీగా ఉన్నప్పటికీ గత కొద్దీ రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పాములు, కొండచిలువలు మనుషులు ఉండేచోటికి వచ్చేస్తున్నాయి .

తాజాగా ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ పరిసరాల్లో ఓ కొండ చిలువ కనిపించి కలకలం సృష్టించింది. కరోనా లాక్ డౌన్ కారణంగా తాజ్ మహల్ ను మూసి వేసిన సంగతి తెలిసిందే.

సందర్శకులు లేక తాజ్ మహల్ వెలవెలబోతోంది.జనం లేకపోవడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు అడుగుల పొడవైన కొండ చిలువ కనిపించింది.

దీంతో అది గమనించిన అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వైల్డ్‌ లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ బృందానికి సమాచారం అందించారు.వెంటనే రిస్క్యూ టీం ఆ పామును పట్టుకొని అడవిలోకి వదిలేశారు.

భద్రతా సిబ్బంది సహకారంతో కొండా చిలువను గుర్తించి కనుక్కున్నారు.ప్రస్తుతం ఈ పాముకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube