మా కమలమ్మ విజయం సాధించింది: తమిళనాడులో పోస్టర్ల కలకలం, మేనకోడలు ట్వీట్

నవంబర్ 3న అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికిగాను భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను డెమొక్రాటిక్ పార్టీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ఈ నిర్ణయంపై అమెరికాలోని భారతీయ సమాజంతో పాటు భారతీయులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Democrat Senator Kamala Harris Poster In Tamil Nadu, Her Niece Tweets Photo, Dem-TeluguStop.com

ఇక ఆమె సొంత రాష్ట్రం తమిళనాడులో సందడి మామూలుగా లేదు.ఈ క్రమంలో కమలా హారిస్ విజయం సాధించినట్లేనని అక్కడ ఓ పోస్టర్ వెలిసింది.

దానిలో ‘‘ పీవీ గోపాలన్ మనవరాలు విజయం సాధించింది’’ అని తమిళంలో రాసివుంది.

ఈ విషయాన్ని కమలా హారిస్‌ మేనకోడలు, కాలిఫోర్నియాకు చెందిన మీనా హారిస్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

తన చిన్నతంలో చెన్నైకి వెళ్లినప్పుడల్లా… తమ ముత్తాత గురించి తెలుసుకునేవాళ్లమని.మా బామ్మకు ఆయన కొండంత అండగా ఉండేవారని, ఇప్పుడు వాళ్లు ఎక్కడ వున్నా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారనుకుంటా’’ అని మీనా పేర్కొన్నారు.

కాగా, కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైకి చెందినవారే.హారిస్ తాతగారు పీవీ గోపాలన్ తంజావూరు జిల్లా పైంగనాడు ప్రాంతానికి చెందినవారు.ఆయన నాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు.అనంతరం జాంబియాలో కీలక బాధ్యతలు నిర్వహించారు.కమలా తండ్రి జమైకాకు చెందిన నల్లజాతీయుడు డొనాల్డ్ హారిస్.

కమల చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

అనంతరం కాలంలో కమలా హారిస్ హోవర్డ్ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్ధిక శాస్త్రంలో డిగ్రీ చేశారు.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.2010, 2014లలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube