ఏపీలో వారందరి ఫోన్ లు ట్యాపింగ్ ? ప్రధానికి ఫిర్యాదు ?

ఏదో ఒక సంచలన ఆరోపణలు ఏపీ ప్రభుత్వం పై వస్తూనే ఉన్నాయి.కొద్ది రోజులుగా ఏపీకి చెందిన ప్రముఖులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటూ అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మొదటగా ఆరోపణలు రాగా, ఆ తరువాత నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన ఫోన్ లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తుందని, తాను ఎవరితో మాట్లాడుతున్నాను ? ఏమిమి మాట్లాడుతున్నాను అనే విషయాలను తెలుసుకుంటోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా, టిడిపి అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు.

 Ap Government Facing Phone Tapping Allegations  Phone Taping, Ap Political ,chan-TeluguStop.com

పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ,21 ఉల్లంఘన ఏపీలో యథేచ్ఛగా జరుగుతోందని, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు ఏపీ ప్రభుత్వం పాల్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ కి చంద్రబాబు లేఖ రాయడం కలకలం రేగింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ జర్నలిస్టు, మీడియా అధిపతులు, నాయకులు, కార్యకర్తల ఫోన్ నుంబర్లను ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తుందని ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Modhi Prime, Phone, Ysrcp-Telugu Political News

ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయడం, చట్టవిరుద్దం అయినా, ఏపీ ప్రభుత్వం వాటిని కాలరాస్తూ, ట్యాంపరింగ్ చేస్తోందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలంటూ ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కేంద్ర హోంశాఖకు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.ఇప్పుడు ఏకంగా చంద్రబాబు స్వయంగా ప్రధాని మోదీ కి లేఖ రాయడం సంచలనంగా మారింది.వాస్తవంగా నిఘా విభాగానికి ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఉంటుంది.

దీనిపై కొంత కాలంగా అభ్యంతరాలు ఉన్నాయి.

ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణ వ్యవహారం కాదు.

చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ ఈ వ్యవహారాలకే పరిమితం అయిందనే ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి.తాజాగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పై ఇదే రకమైన ఆరోపణలు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ అంశం.కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ ప్రభుత్వం పై చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు.

కాకపోతే ప్రస్తుతం బీజేపీ వైసీపీ కి మధ్య ఉన్న సంబంధాల కారణంగా, ఈ వ్యవహారంపై బిజెపి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అనే దానిపైనే ఇప్పుడు ఈ వ్యవహారం ముడిపడి ఉంటుంది.రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించే అవకాశం లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube