రాశీ ఖన్నా.ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బొద్దు బొద్దు అందాలతో.అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది రాశి ఖన్నా.తెలుగు, మలయాళం, తమిళం అన్ని భాషల్లో గ్లామర్ క్వీన్ గా పేరు సంపాదించినా రాశీ ఖన్నా ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో తన మల్టీ టాలెంట్ ని బయటపెట్టింది.
తనలో దాగి ఉన్న ప్రత్యేక టాలెంట్ అన్నింటిని బయటకు తీసుకొచ్చింది.
ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన గిటార్ ప్లే చేస్తూ ఒక తెలుగు పాటను పాడింది.ఆ పాట వింటే ఆహా అనకుండా ఉండలేరు.
ఆ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఫ్రెండ్ వల్లే ఇది సాధ్యమైందంటూ రాశీ క్యాప్షన్ పెట్టింది.
హుషారు సినిమాలోని ఉండిపోరాదే పాట పాడిన రాశి ఖన్నా అందరిని ఆకట్టుకుంది.
పాట పాడుతూ గిటార్ ప్లే చెయ్యడంతో సాంగ్ మరింత వినసొంపుగా ఉంది.ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో వైరల్ అవుతుంది.
నువ్వు ఇంత బాగా పాడగలవు అని అసలు ఊహించలేదు రాశీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.