ఎస్పీబీ కి ప్లాస్మా చికిత్స,మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆసుపత్రి

కరోనా తో క్షీణించిన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు ప్లాస్మా థెరపీ చేయనున్నట్లు తాజాగా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.ఈ నెల 5 వ తారీఖున కరోనా లక్షణాలతో చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

 Doctors Are Ready To Plasma Therapy For Sp Balasubramanyam , Plasma Therapy, Sp-TeluguStop.com

అయితే అప్పటినుంచి ఆయన కరోనా కు చికిత్స పొందుతుండగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం తో ప్రస్తుతం ఆయనకు రెండు రోజుల నుంచి వెంటిలేటర్ పైనే వైద్యం అందిస్తున్నారు.అయితే ఆయన వయసు కూడా ఎక్కువగా ఉండడం తో ఆయనకు ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుండడం తో ఆయనకు ప్లాస్మా థెరపీ ఇవ్వడానికి ఆసుపత్రి వర్గాలు సిద్ధమయ్యాయి.

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన మొన్నటి వరకు నిలకడగా ఉన్నప్పకిటీకీ తాజాగా విషమంగా మారడంతో ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు వెంటిలేటర్ పై ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఈ క్రమంలో బాలు ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకోవడం కోసం తాజాగా తమిళనాడు మంత్రి విజయ భాస్కర్‌ ఎంజీఎం ఆసుపత్రి కి వెళ్లి బాలును పరామర్శించి, ఆయన చికిత్సకు సంబంధించిన వివరాల్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అంతేకాకుండా ఎస్పీ బాలుకు అయ్యే వైద్య ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని, ప్లాస్మా థెరపీ కూడా అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

Telugu Doctors, Doctorsready, Plasma Therapy, Spb Corona-

ప్లాస్మా థెరపీ తో ఆయన చికిత్స అందించనుండగా మరో రెండు రోజుల పాటు ఆయనను వెంటిలేటర్ పైనే ఉంచనున్నట్లు సమాచారం.ఒకపక్క కరోనా కారణంగా బాలు ఆరోగ్య పరిస్థితి ఇలా విషమంగా మారిన ఈ సమయంలో ఆయన సతీమణి సావిత్రి బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడిన విషయం విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube