హడలెత్తిస్తున్న కరోనా, 102 రోజుల తరువాత మరోసారి ఆ దేశంలో వెలుగుచూసిన...

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది.ఇప్పటికే ఈ మహమ్మారి తో ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో నష్టపోయాయో అందరికీ తెలిసిందే.

 After 102 Days New Zealand Reports One New Covid 19 Case, New Zealand , Covid 1-TeluguStop.com

ఇటీవల ఈ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడినట్లు ప్రకటించిన న్యూజిలాండ్ లో మరోసారి కరోనా కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా ఫ్రీ దేశంగా మారిన న్యూజిలాండ్ లో 102 రోజుల తరువాత మరోసారి కరోనా కేసు నమోదవ్వడం విశేషం.

మంగళవారం నాడు మరోకేసు నమోదు అవ్వడం తో మొత్తం ఆ దేశంలో యాక్టివ్ అయిన కేసుల సంఖ్య 1220 కు చేరినట్లు తెలుస్తుంది.గత నెల 30 న తాజాగా పాజిటివ్ వచ్చిన 20 ఏళ్ల యువకుడు మెల్ బోర్న్ నుంచి న్యూజిలాండ్ కు వచ్చినట్లు సమాచారం.

అయితే అతడికి తొలుత పరీక్షలు నిర్వహించినప్పుడు నెగిటివ్ రాగా, తొమ్మిదు రోజుల అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించడం తో పాజిటివ్ వచ్చింది.అయితే ప్రస్తుతం అందరి పరిస్థితి బాగానే ఉందని,ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు అంటూ అధికారులు వెల్లడించారు.

గత 102 రోజులుగా ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోవడం తో ఆ దేశం కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించుకుంది.అయితే మంగళవారం తాజాగా నమోదైన కేసుతో ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.

మరోపక్క ఈ మహమ్మారికి సంబంధించి వ్యాక్సిన్ తీసుకువచ్చే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.దీనితో COVID-19 రోగనిరోధకత కార్యక్రమం కోసం మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube