ఇది విన్నారా...? త్వరలో గాడిద పాల కేంద్రం పెడుతున్నారట...!

ఇంతవరకు మనం గేదె, ఆవు, మేక పాల గురించి విన్నాం, వాటిని తాగాము కూడా.అయితే ఇప్పుడు పాల ఉత్పత్తి కోసం చాలా రకాల పాడి పశువులను పెంచుతున్నారు.

 Doneky, Milk, Nrce , Halari Donkey, Cirb, Icar,-TeluguStop.com

అయితే మనం పాల కోసం ఆవు, గేదె ల నుండి వచ్చే పాలను డైరీల ద్వారా పొందగలుగుతుంది.ఇకపోతే తాజాగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా గాడిద పాలు తయారు చేసే డైరీని మొదలు పెడుతున్నారు.

భారతదేశంలోని నేషనల్ హార్స్ రీసెర్చ్ సెంటర్ ఈ కార్యక్రమానికి ప్రణాళికలను రూపొందించింది.

ఈ డైరీ కోసం ఇప్పటికే 10 హాలరి జాతి గాడిదలను సైతం కొనుక్కునేందుకు ఆర్డర్ ఇచ్చింది.

రోగ నిరోధకశక్తిని పెంపొందించే వైద్యంలో గాడిదపాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు తెలిపారు.అంతేకాదు ఈ పాలు వలన చిన్న పిల్లలకు వచ్చే జబ్బులకు మంచి ఔషధంగా పనిచేస్తాయని తెలుస్తోంది.

అయితే ఈ గాడిదపాలు ధర వింటే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే.ఈ ఔషధాలు ఏకంగా ఒక్క లీటర్ దాదాపు 3 వేల నుండి 7 వేల ధర పలుకుతాయి అని తెలుస్తోంది.

దీనికి ఇంత ఖరీదు గల కారణం రోగ నిరోధక శక్తి పెంపొందించడమే.కాబట్టి అనేక వ్యాధులకు పోరాడగలిగే రోగనిరోధకశక్తి ఈ పాలలో ఉండడంతో సెంట్రల్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి శాస్త్రవేత్తల సహాయాన్ని నేషనల్ హార్స్ రీసెర్చ్ సెంటర్ కోరింది.

ఇకపోతే ఈ ప్రక్రియ గాడిదల రీడింగ్ తర్వాత మొదలవుతుందని నేషనల్ హార్స్ రీసెర్చ్ సెంటర్ అధికారులు తెలిపారు.ఈ పాలలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

అంతేకాదు ఈ గాడిద పాలతో ఇప్పటికే సబ్బులు, బాడీ లోషన్ లాంటి సౌందర్య ఉత్పత్తులను దేశంలో తయారీ మొదలుపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube