కరోనా కాటుకు మాజీ ఎంపీ మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.సామాన్య ప్రజల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు, సెలబ్రెటీల నుంచి ధనవంతుల వరకు కరోనా అందరని సమానంగా చూస్తోంది.

 Telangana Congress Leader Nandi Yellaiah Dies Due To Covid-19,congress Ex Mp Die-TeluguStop.com

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా బారిన పడిన ప్రజాప్రతినిధులు కొందరు మృతి చెందారు.మరి కొందరు చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటునప్పటికీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.కరోనా కట్టడికి పలు నిబంధనలు అమలు చేసిన చేసిన ప్రజలు ఆ నిబంధనలకు బేఖాతరు చేస్తున్నారు.

దీంతో కరోనా వ్యాప్తి అధికమవుతోంది.తాజాగా కరోనా బారిన పడి కాంగ్రెస్ ఎంపీ మృతి చెందాడు.

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనా బారిన పడి మరణించారు.గత కొద్ది రోజుల క్రితం జ్వరం, దగ్గు, జలబుతో బాధ పడుతున్న ఆయన కోవిడ్ యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించుకున్నాడు.

కాగా, అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు.దీంతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.కాగా, చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు విడిచారు.ఎల్లయ్య మృతిపై పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

ఐదు సార్లు లోక్ సభ, రెండు సార్లు రాజ్యసభకు ఎల్లయ్య ప్రాతినిధ్యం వహించాడని, తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టాడని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube