కన్నడ టెలివిజన్ లో దుమ్మురేపిన సరిలేరు నీకెవ్వరు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మహేష్ బాబు కెరియర్ లో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

 Sarileru Neekevvaru Gets Massive Trp In Kannada, Super Star Mahesh Babu, Anil Ra-TeluguStop.com

వరుసగా సీరియస్ సినిమాలతో మహేష్ బాబుని చూసిన ప్రేక్షకులకి సరిలేరులో మరోసారి తన కామెడీ టైమింగ్ తో అలరించిన మహేష్ ని చూసేసరికి రిలాక్స్ అయ్యారు.అనిల్ మార్క్ కామెడీ, హీరోయిజం, డైలాగ్స్ అన్ని కూడా సినిమాని మరో ఎత్తుకి తీసుకెళ్ళాయి.

ఆద్యంతం ఆహ్లాదంగా సాగిపోయే కథనంతో అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ సినిమా అలరించింది.

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తెలుగు టెలివిజన్ లో ఇప్పటికే ప్రసారం అయ్యి బాహుబలి 2 రికార్డుని సైతం బ్రేక్ చేసి అత్యధికంగా 23.4 టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా కన్నడ బాషలో కూడా రిలీజ్ అయ్యింది.అక్కడ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలో కన్నడ బాషలో కూడా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి.

అందులో రంగస్థలం, సైరా నరసింహా రెడ్డి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అయ్యింది.ఇక కన్నడ టెలివిజన్ లో ఈ సినిమా ప్రీమియం 6.5 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది.కన్నడంలో డబ్బింగ్ అయిన తెలుగు సినిమాలలో ఇదే అత్యధికం.దీనిని బట్టి కన్నడంలో కూడా మహేష్ బాబుకి ఫాలోయింగ్ ఏవిధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube