అమెరికాలో టిక్ టాక్ నిషేధం.. మరో 45 రోజుల్లోగా !

కరోనా నేపథ్యంలో అమెరికా-చైనాకు మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయం అందిరికీ తెలుసు.ప్రస్తుతం ఈ యుద్ధం మరీ ఎక్కువైంది.

 Tiktok Banned In America, Donald Trump, America President, Tik Tok Banned, China-TeluguStop.com

చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా సకల ప్రయత్నాలు చేస్తోంది.చైనా కూడా అలాగే ఆలోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు.

అందుకే చైనా ఆర్థికంగా దెబ్బ తీయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఇప్పటికే కొన్ని దేశాల్లో బ్యాన్ చేసిన టిక్ టాన్ ను ఇప్పుడు అమెరికా కూడా నిషేధించనుంది.

చైనాకు సంబంధించిన కొన్ని యాప్ కంపెనీలు అమెరికన్ పౌరుల విలువైన సమాచారాలను దొంగలించి చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి చేరవేస్తున్నాయని తెలిపారు.ఈ మేరకు టిక్ టాక్ నిషేధం కోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు కూడా చేశారు.

కాగా, టిక్ టాక్ ను మరో 45 రోజుల్లోగా నిషేధించడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.

చైనాకు సంబంధించిన యాప్ లను ఇప్పటికే ఇండియా నిషేధించింది.

250 యాప్ లను పర్యవేక్షణలో పెట్టింది.వీటిని ఎప్పుడైనా నిషేధించవచ్చు.

ప్రముఖ సంస్థ గూగుల్ కూడా తన యాప్ స్టోర్ ల నుంచి చైనాకు సంబంధించిన యాప్ లను లైసెన్స్ లేని కారణంగా తొలగించిన విషయం అందరికీ తెలిసిందే.భారత్, అమెరికా దేశాలు చైనా యాప్ లను నిషేధిస్తుండటంతో మిగిలిన దేశాలు కూడా యాప్ లను నిషేధించే ఆలోచనలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube