తెలుగు కుర్రాడి సేవలకి సలామ్ కొడుతున్న సింగపూర్ ప్రజలు..!!

కరోనా మహమ్మారి ప్రభావంతో సింగపూర్ ప్రజలు తీవ్ర నష్టాలలో కూరుకుపోయారు.ఎంతో మంది ఉపాధి కోల్పోవడంతో కడుపు నింపుకునే దారికూడా లేని పరిస్థితులు ఎదురయ్యాయి.

 Indian Boy Donates 20 Lakhs To Covid Victims, Covid Victims, Singapore-TeluguStop.com

ఇక కరోనా బాధితుల బాధలు వర్ణానాతీతం అలాంటి వారికి తన వంతు సాయం చేయడానికి 15 ఏళ్ళ తెలుగు తేజం ముందుకు వచ్చాడు.సింగపూర్ లో అమెరికన్ హై స్కూల్ లో చదువుకుంటున్న శ్రీ హర్ష కరోనా బాధితులకి అండగా నిలిచాడు…కరోనా మహమ్మారి నియంత్రణ కోసం తన వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి మరీ బాధితులకి అందజేశాడు.

ఆర్ధిక ఆక్షరాస్యతపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 90 రోజుల పాటు పలు స్వచ్చంద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు.అవసరమైన వారికి సాయం చేయండి వారిలో ఆశలు నింపండి అనే నినాదంతో శ్రీ హర్ష పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.దాతల నుంచీ సేకరించిన సుమారు రూ.20 లక్షల మొత్తాన్ని సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గివ్ డాట్ ఎస్జీ అనే చారిటీ కి విరాళంగా అందజేశాడు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే కరోనా బాధితుల కుటుంభ సభ్యులకి మందులు నిత్యావసరాలు అందిస్తోంది.ఇప్పటి వరకూ తాను చేపట్టిన కార్యక్రమాలని మరింత విస్తృతం చేయాలని భావించిన హర్ష స్వయంతో తన స్కూల్ మిత్రులతో కలిసి ఏకాన్ 101 అనే స్వచ్చంద సంస్థను స్థాపించాడు.

దీని ద్వారా యువ విద్యార్ధులకు ఆర్ధిక అక్షరాస్యతపై జూమ్ యాప్ ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు.అతడి సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తున సేవా కార్యక్రమాలు ఎంతో మంది చిన్న పిల్లలకి.

పేద విద్యార్ధులకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రశంసలు వస్తున్నాయి.ఇంత చిన్న వయసులో శ్రీ హర్ష చేస్తున్న సేవాకార్యక్రమాలకు సింగపూర్ వాసులు సలామ్ కొడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube