ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన షా... రచ్చ చేస్తున్న కాంగ్రెస్!

ఒకపక్క కరోనా మహమ్మారితో బీజేపీ కీలక నేతలు వరుసగా హాస్పల్ పాలవుతుంటే కాంగ్రెస్ మాత్రం రచ్చ రచ్చ చేసేస్తుంది.కరోనా పాజిటివ్ వచ్చిన వారు సురక్షితంగా బయటపడితే చాలు అని అనుకోవాల్సింది మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో ఎందుకు చేరారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు.

 Why Home Minister Is Not Admitted In Government Hospital Says Congress Leader Sh-TeluguStop.com

తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా పాజిటివ్ కు గురైన విషయం తెలిసిందే.అయితే ఆయన ఆరోగ్య రీత్యా ఢిల్లీ సమీపంలో గురు గావ్ లో గల మేదాంత అనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.

అయితే ఒకపక్క ఆయన ఆరోగ్యం ఎలా ఉందొ అన్న సంగతి పక్కనపెడితే కాంగ్రెస్ నేత శశి థరూర్ మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
కరోనా పాజిటివ్ కి గురైన కేంద్ర హోం మంత్రి షా ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎందుకు చేరలేదని,పొరుగున ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం ఏంటి అంటూ ప్రశ్నించారు.

ఎప్పుడైనా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే పవర్ లో ఉన్నవారు ప్రభుత్వ సంస్థలను (ఆసుపత్రులను) ప్రోత్సహించాల్సి ఉంటుందన్నారు.అస్వస్థత పాలైన షా ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా పొరుగున ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడం ఆశ్చర్యంగా ఉందంటూ ట్వీట్ చేసారు.

ఇప్పటికే బీజేపీ కి చెందిన పలువురు కీలక నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Telugu Amit Shah, Corona, Private, Shashi Tharoor, Congressshashi-Telugu Politic

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కు కరోనా సోకడం తో ప్రస్తుతం ఆయన కూడా ప్రయివేట్ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకుంటుండగా, కర్ణాటక సీఎం యడ్యూరప్ప కు కూడా కరోనా పాజిటివ్ రావడం తో నగరంలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.అయితే వారంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఎందుకు పొందుతున్నారు అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube