వారికి విమానమే ఇల్లు.. ఎంత బాగుందో!

సృజనాత్మకంగా ఆలోచిస్తే ఎలాంటి వస్తువును అయినా సరే కొత్తగా చేసుకోవచ్చు.దీని విలువ ఇంతే అని వేల కట్టినవారికి కూడా సృజనాత్మకతతో సరికొత్త తయారు చేసి అందంగా చెయ్యచ్చు.

 Aero Home, Aeroplane, America, Bruce Campbell, Airplane House-TeluguStop.com

సృజనాత్మకతకు అంత విలువ ఉంది.ఇంకా ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఒకేగాన్‌ రాష్ర్టానికి చెందిన 64 ఏండ్ల బ్రూస్‌ క్యాంప్‌బెల్‌ అనే వ్యక్తి చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

అతను ఎం చేశాడు ? అంత కొత్తగా ఏముంది అని అనుకుంటున్నారా? అదేనండి.తన పొలంలో ఓ వెరైటీ ఇంటిని నిర్మించుకున్నాడు.

ఆ ఇంటిని చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.అంత అద్భుతంగా ఉంటుంది ఆ ఇల్లు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.1999లో గ్రీస్‌లో ఒలంపస్‌ ఎయిర్‌వేస్‌ నుంచి ఉపయోగంలో లేని బోయింగ్‌ 737 విమానాన్ని లక్ష డాలర్లకు కొనుగోలు చేశాడు.

ఇంకా ఆ విమానాన్ని అయన పొలంలోకి చేర్చటానికి మరో లక్షా 20వేల డాలర్లు ఖర్చు చేశాడు.అనంతరం ఆ విమానంలో భారీ మార్పులు చేసి విమానాన్ని ఇంటిగా మార్చేసుకున్నాడు.

ఆ విమానంలో బెడ్ రూమ్ నుండి వంట గది వరకు అన్ని సరికొత్తగా చేసి వావ్.సూపర్ విమానం ఇల్లు అంటూ నెటిజన్లతో ప్రశంసలు పొందుతున్నాడు బ్రూస్‌ క్యాంప్‌బెల్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube