రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్... అర్ధరాత్రి ఉత్తర్వులు

గత కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలాన్ని తగ్గిస్తూ అర్ధంతరంగా ఏపీ ప్రభుత్వం ఒక జీవో ఉత్తర్వులు తీసుకొచ్చి వాటిని అమలు చేసి రమేష్ కుమార్ ని తొలగించింది.

 Ramesh Kumar Appointed State Election Commissioner, Ap Politics, Ap Cm Ys Jagan,-TeluguStop.com

అయితే దీనిపై రమేష్ కుమార్

హైకోర్టు

ని ఆశ్రయించారు.హైకోర్టు రమేష్ కుమార్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చి, ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యంగా విరుద్ధం అని, అవి ఎంత మాత్రం చెల్లవని కొట్టిపారేసింది.

రమేష్ కుమార్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశించింది.అయిన కూడా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

ఏదో ఒక విధంగా అడ్డుకొని కాలయాపన చేస్తూ వచ్చింది.దీంతో రమేష్ కుమార్ మరో సారి హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ కావడం జరిగింది.

దానిపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని, వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందే అని స్పష్టం చేసింది.

ఇక రమేష్ కుమార్ గవర్నర్ ని కూడా కలిసి సుప్రీంకోర్టు తీర్పు గురించి విన్నవించారు.

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్డుకోవడానికి ఉన్న అన్ని దారులు ఏపీ ప్రభుత్వానికి మూసుకుపోవడంతో తప్పని సరి పరిస్థితిలో అర్ధరాత్రి ఆయన్ని ఎన్నికల కమిషనర్ ని నియమిస్తూ తిరిగి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది.దీంతో నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే, అత్యున్నత ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడే పునర్నియామకం ఉంటుందని స్పష్టం చేశారు.కాగా, రమేశ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube