యుఏఈ వేదికగా జరగబోయే ఐపీఎల్ 2020 కు ముందుగా ఏ జట్టు వెళుతుందో తెలుసా..?

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్చి నెలలో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఎట్టకేలకు సెప్టెంబర్ నెలలో యూఏఈ దేశంలో మొదలుకానుంది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ కార్యవర్గానికి ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చాయి కూడా.

 Ipl 2020, Chenai Super Kings, Bcci, Dubai, Uae-TeluguStop.com

ఇక ఈ నేపథ్యంలో ఐపిఎల్ ఫ్రాంచైజీలు అన్ని వారి ఆటగాళ్లతో ఆటకు సన్నద్ధమవుతున్నాయి.ముందుగా ఆటగాళ్లను యూఏఈ కి తరలించడానికి ఫ్రాంచైజీ యాజమాన్యాలు సిద్ధం చేస్తున్నారు.

ఇకపోతే ఆల్ టైం ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందుగానే అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఆగస్టు 12 కల్లా దుబాయిలో అడుగుపెట్టాలని ఆ జట్టు సన్నద్ధమవుతోంది.

ఆ తర్వాత ఆగస్టు 15 నుండి ఆటగాళ్లు అందరికీ శిక్షణ మొదలు చేసేలా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆలోచన చేస్తోంది.ఇకపోతే తాజాగా చైన్నై టీమ్ సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ… ఆగస్టు 8 వ తేదికి ఆటగాళ్ళని దుబాయ్ కి తరలించే విధంగా ప్లాన్ చేస్తున్నాం అని, ఆగస్టు రెండో వారంలో ట్రైనింగ్ క్యాంప్ మొదలు పెడతామని తెలిపారు.

ఇకపోతే ఐపీఎల్ సంబంధించి బిసిసిఐ విడుదల చేసిన కొన్ని ప్లాన్స్ ప్రకారం ట్రావెల్ ప్లాన్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తాన్ని చార్టెడ్ ఫ్లైట్ లోని దుబాయ్ కి తీసుకువెళ్లడానికి జట్టు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది.

కేవలం చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే కాకుండా మిగతా టీం యాజమాన్యం కూడా వారి ఆటగాళ్లను దుబాయ్ కు తరలించడానికి వారి వారి ప్రయత్నాలు మొదలు పెట్టారు కూడా.అయితే సెప్టెంబర్ మొదలయ్యే ముందు కంటే దాదాపు అన్ని చెట్లు దుబాయ్ కు చేరుకుంటాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ కు సంబంధించి అన్ని కార్యక్రమాలు చకచక మొదలైపోయాయి.ఇక ఆగస్టు మూడో వారంలో ఐపీఎల్ 2020 కి సంబంధించి పాలక మండలి సమావేశం జరగనుండగా, అప్పుడే ఐపీఎల్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేసేలా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube