వందే భారత్ మిషన్ పై కీలక సూచనలు చేసిన కేంద్రం..!!!

అమెరికాలో కరోనా కారణంగా చిక్కుకుపోయిన భారతీయులని ఇండియా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందే భారత్ మిషన్ సక్సెస్ సాధించింది.ఎంతో మంది భారతీయులు కేంద్రం ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

 Vande Bharat Mission, Flight Charges, Travel Agents, Indians, No Need To Pay Ext-TeluguStop.com

కరోనా కారణంగా ఆందోళన చెందుతున్న ఎంతో మంది భారతీయులకి ఈ మిషన్ ఊరటని ఇచ్చిందనే చెప్పాలి.ఇప్పటి వరకూ లక్షలాది మంది భారతీయులు ఈ మిషన్ ద్వారా అమెరికా నుంచీ భారత్ చేరుకున్నారు.

కాగా ఇప్పటికే 4 దశ లు పూర్తి చేసుకున్న ఈ మిషన్ ప్రస్తుతం 5వ దశ కి చేరుకుంది.

ఆగస్టు 1 నుంచీ మొదలవ్వనున్న ఈ మిషన్ మరింత మంది భారతీయులని ఇండియా తీసుకురావడానికి సిద్దంగా ఉంది.

ఈ క్రమంలోనే విమానయాన సంస్థలు టిక్కెట్ల విక్రయానికి సిద్దమయ్యాయి.ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం టిక్కెట్లు కొనుగోలు చేసే భారతీయులకి కొన్ని కీలక సూచనలు చేసింది.వందే భారత్ మిషన్ లో భాగంగా టిక్కెట్లు బుక్ చేసుకునే తప్పుడు ట్రావెల్ ఏజెంట్స్ కి అధిక చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఏ మాత్రం లేదని తెలిపింది.అలాగే

టిక్కెట్లు ప్రక్రియ మొదలయ్యిందని, దాంతో ట్రావెల్ ఏజెంట్స్ చార్జీల విషయంలో భారీగా దోచుకుంటున్నారు అని తెలుసుకున్న కేంద్రం అసలు చార్జీలని ఎయిర్ ఇండియా వెబ్ సైట్ లో పొందుపరిచారు.

ముంబై, అహ్మాదాబాద్ , ఢిల్లీ , చెన్నై, కొచ్చి, బెంగుళూరుతో పాటు పలు ప్రధాన నగరాలలో ఆగస్టు 30 వరకూ ఎయిర్ ఇండియా విమానాలు నడపనుంది.ఇదిలాఉంటే వందే భారత్ మిషన్ మొదలు పెట్టింది మొదలు ఇప్పటి వరకూ సుమారు 8 లక్షల మంది వచ్చారని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube