హితం యాప్‎తో కరోనా రోగుల వివరాలు నమోదు -ఈటల

హితం యాప్ ద్వారా కరోనా రోగుల వివరాలను నమోదు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.కరోనా వచ్చిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండవని అన్నారు.

 Hitam App, Corona Tests, Corona Positive, Minister Etela Rajender, Hyderabad, Mo-TeluguStop.com

హైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్‎లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‎ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.అ తర్వాత కరోనా వైరస్ పరీక్షలు చేసే సంచార వాహనాన్ని మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు.

మొబైల్ ల్యాబ్‎లో ఒకేసారి 10 మంది నుంచి నమూనాలు తీసుకునే అవకాశం ఉంది.వీటి ద్వారా వివిధ ప్రాంతాల్లో కరోనా పరీక్షల కోసం స్వాబ్ నమూనాలను స్వీకరించడం సులువు అవుతోంది.

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.కరోనా నివారణకు ప్రాణాలను ఫణంగా పెట్టి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.వైద్య సిబ్బంది మానసిక స్థైర్యం రూ.1 కూడా ఖర్చు లేకుండా 81 శాతం మందికి ఉచితంగా కరోనా చికిత్స అందిస్తున్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు.ఐదు శాతం మందికి మాత్రమే వెంటిలేటర్, నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ అవసరం అవుతోందని చెప్పుకొచ్చారు.కరోనా లక్షణాలు లేనివారికి ఇంట్లోనే ఐసోలేషన్ ఉంటుందని.

అక్కడ సౌకర్యం లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స అందిస్తామన్నారు.పది రోజుల పాటు మందులు, మాస్కులు అందిస్తామని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube