ఇదిగో సోనూ సూద్... సహాయం చేసే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించు...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ బాగానే తెలిసిందే.అయితే ఈ కరోనాకాలంలో తమ సొంత గ్రామానికి చేరుకోలేనటువంటి ఎంతో మంది అభాగ్యులని దగ్గరుండి వారి స్వస్థలాలకు పంపించి వారికి ఈ కరోనా కాలంలో దేవుడయ్యాడు.

 Sonu Sood, Tollywood Veteran Actor, Corona Virus, Lock Down, Tractor Help To The-TeluguStop.com

అంతేగాక  ఇతరులు కష్టపడుతున్నారని తెలిస్తే చాలు ముందు వెనుక ఆలోచించకుండా రంగంలోకి దిగి తనకు చేతనైనంత సాయం చేసి ఆ కష్టాలు దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అయితే తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లి పరిసర ప్రాంతంలోని నాగేశ్వర రావు అనే ఓ రైతు కాడెద్దులు కొనుక్కునే స్థోమత లేక తన ఇద్దరు కూతుళ్లను ఎద్దులుగా మార్చి నాగలితో దున్నుతున్న ఘటనను చూసి చలించిపోయిన సోనూ సూద్ వారికి దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే ట్రాక్టర్ ని కొని పెట్టాడు.

అయితే విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.దీంతో స్థానిక రాజకీయ నాయకులు ప్రజలను పట్టించుకోవడంలేదని అని కొందరు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ విషయం గురించి స్పందించిన కొందరు స్థానిక రాజకీయ నాయకులు తమ కూతుళ్లను ఎద్దులుగా మార్చి నాగలి దున్నినటువంటి నాగేశ్వరరావు అనే రైతు కి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేసిందని, అంతేగాక నాగేశ్వరరావు లోక్ సత్తా పార్టీలో మంచి పేరున్న నాయకుడని తెలిపారు. అంతేగాక గతంలో లోక్ సత్తా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేస్తాడని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ సోనూ సూద్ చేసిన ఈ మంచి పనికి అభినందించడమే కాకుండా దయచేసి నిజంగా ఎవరైతే అవసరాల్లో ఉన్న వారికి ఇలాంటి సహాయం అందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఈ కరోనా సమయంలో సోనూ సూద్ చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు ఎనలేనివని కాబట్టి అవి నిజంగా అవసరాల్లో ఉన్నటువంటి వారికి అందితే అర్థం ఉంటుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube