మాస్కు పెట్టుకోమంటే కత్తితో పొడిచాడు..!

మంచి కోసం చెప్పినా తప్పే అన్నట్లే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు.కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరిలో అస్సలు మార్పు రావడం లేదు.మాస్క్ ధరించకుండా రూ.1000 జరిమానా విధిస్తామన్న నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు.ఇష్టారాజ్యంగా మాస్క్ ధరించకుండా తిరుగుతున్నాడు.మాస్క్ ఏదని అడిగినందుకు ఎదురు తిరుగుతున్నారు.కొందరు గొడవలకు దిగుతున్న దాఖలాలు ఉన్నాయి.అయితే తాజాగా ఓ యువకుడు కటింగ్ షాపుకు వెళ్లినప్పుడు మరో యువకుడు మాస్క్ ధరించమని సూచించాడు.

 Karimnagar, Youth, Mask, Police , Hafiz-TeluguStop.com

దీంతో వారి మధ్య వాగ్వాదం నెలకొంది.దీంతో కోపోధ్రిక్తుడైన ఆ యువకుడు ఏకంగా ఆ యువకుడిని కత్తితో పొడిచాడు.

ఈ దారుణ సంఘటన కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో చోటు చేసుకుంది.హఫీజ్ అనే యువకుడు స్థానికంగా ఉన్న కటింగ్ షాపులో హెయిర్ కట్ చేసుకుందాం అని వెళ్లాడు.

కటింగ్ షాపులో రాజేష్ అనే మరో యువకుడు హఫీజ్ మాస్క్ ధరించకపోవడంతో అతడిని మాస్క్ ధరించమని సూచించాడు.దీంతో హఫీజ్ నీకెందుకు అన్నట్లు ఎదురు తిరిగాడు.ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.షాపులో ఉన్న ప్రజలు ఎంత ఆపినా ఊరుకోలేదు.

కోపంతో ఊగిపోయిన హఫీజ్ పక్కనే ఉన్న కత్తిని తీసుకుని రాజేశ్ పక్కటెముకల్లో, వీపులో పొడిచాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే స్థానికులు పట్టుకున్నాడు.

రాజేష్ కు కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.దీంతో స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు హఫీజ్ ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, హఫీజ్ గంజాయి మత్తులో ఉన్నాడని స్థానికులు పేర్కొంటున్నారు.కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube