రామ్ గోపాల్ వర్మకి ఫైన్  విధించిన జీహెచ్ఎంసీ అధికారులు...

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవిత గాధ ఆధారంగా ఇటీవలే “పవర్ స్టార్” అనే చిత్రాన్ని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే మామూలుగా చిత్రంలో ఏమాత్రం కంటెంట్ లేకున్నప్పటికీ ప్రమోషన్స్ తో క్యాష్ చేసుకోవడంలో రామ్ గోపాల్ వర్మ మంచి దిట్ట.

 Rgv, Director, Tollywood, Ghmc, Power Star-TeluguStop.com

అయితే ఈ ప్రమోషన్స్ భాగంగా అనే ఈ చిత్ర పోస్టర్ ని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు వినియోగించుకున్నాడని అంటూ జిహెచ్ఎంసి అధికారులు రామ్ గోపాల్ వర్మ కి నాలుగు వేల రూపాయలు జరిమానా విధించారు.

అయితే  ఈ జరిమానా ని రామ్ గోపాల్ వర్మ కడతాడా లేదా అనే ఆ విషయం పై మాత్రం ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ స్పందించలేదు.

  దీంతో కొంత మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడంలో ఏ నుంచి జెడ్ వరకు చదివినటువంటి రామ్ గోపాల్ వర్మ జరిమానా గురించి ఏవిధంగా స్పందిస్తాడో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం “మర్డర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఓ పరువు హత్య ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం.కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube