ప్లాస్మా సేవలకు ‘ఆరోగ్య వేద’ యాప్ : నల్గొండ విద్యార్థి

కరోనాతో కాలేజీ మూతబడ్డాయి.దీంతో ఓ యువకుడు ప్రస్తుత విపత్కర పరిస్థితిని సాయ పడే దిశగా ఆలోచన మొదలు పెట్టాడు.

 Nalgonda, Student, Arogya Veda, Plasma App, Sai Vedhaprakash, Book My Show,-TeluguStop.com

అయితే, సాయి వేద అనే యువకుడికి మొదటి నుంచి సాఫ్ట్ వేర్ ప్రోగ్రామింగ్ మీద కొంచెం ఆసక్తి.తనకున్నా ఆసక్తికి మెరుగులు దిద్ది, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఇబ్బందుల్లో ఉన్న కరోనా రోగులకు సాయం చేయాలని అనుకున్నాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మాశెట్టి రాజశేఖర్‌, రమాదేవి దంపతుల కుమారుడు సాయి వేదప్రకాశ్‌.హైదరాబాద్‌లోని ప్రగతి మహావిద్యాలయంలో బీబీఏ ఫైనల్ ఇయర్‌ చదువుతున్నాడు.లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమవడంతో ప్లాస్మా దాతలు, ప్లాస్మా అవసరమైనా రోగులకు కలిపే దిశగా, విపత్కర పరిస్థితులను గమనించి వారిని ఒక వేదికపై ఏర్పాటు చేయాలని అనుకున్నాడు.ప్లాస్మా రిసీవర్స్, ప్లాస్మా డోనర్స్ ఇరువురూ మాట్లాడుకునేలా ఈ నెల 4న ‘ఆరోగ్యవేద’ పేరుతో యాప్‌ డిజైన్ చేశాడు వేదప్రకాశ్‌.

ఫ్లెక్టర్, డాట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ద్వారా కొద్ది రోజుల వ్యవధిలోనే యాప్ ను పూర్తి చేశాడు.

ప్మాస్మా యాప్ డిజైన్ పనితీరుపై సాయివేద గవర్నర్ ఆఫీస్కు ఈ నెల 24న మెయిల్ చేశాడు.

దీనిపై స్పందించిన గవర్నర్ కార్యాలయ అధికారులు సాయివేదకు కాల్ చేశారు.అనంతరం రాష్ర్ట గవర్నర్ తమిళ్ సైతో జూమ్ యాప్లో యాప్ డిజైన్, లక్ష్యం, యాప్ పని చేసే విధానంపై 20 నిమిషాల పాటు సాయివేద ప్రెజెన్‌టేషన్ ఇచ్చాడు.కోవిడ్-19 విపత్కర పరిస్థితిల్లో యాప్ డిజైన్కు ఆలోచన చేయటం తదితర అంశాలను ప్రస్తావిస్తూ గవర్నర్ సాయివేదను ప్రశంసించారు.యాప్ పర్మిషన్ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

కాగా ‘బుక్ మై షో’ సంస్థ ఆరోగ్యవేద యాప్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు రావటం విశేషం.

కరోనా సెలవులను వృథా చేయకుండా బాధితులకు ఉపయోగపడే విధంగా యాప్ రూపొందించిన సాయివేద ప్రకాష్‌ను పలువురు అభినందిస్తున్నారు.

నేటితరం యువత సాయివేదను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తోడ్పాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube