కేబినెట్ సమావేశం నిర్వహించిన గెహ్లాట్,కీలక తీర్మానం

రాజస్థాన్ రాజకీయాల్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు నడుస్తున్నాయి.అక్కడ రాజకీయాల్లో హైడ్రామా నడుస్తుంది.

 Cm Ashok Gehlot Held Cabinet Meeting And Took A Key Decision, Rajasthan Crisis,-TeluguStop.com

సీఎం గెహ్లాట్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించగా కీలక తీర్మానం చేసినట్లు తెలుస్తుంది.జులై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలి అంటూ ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేబినెట్ తీసుకున్న ఈ తీర్మానాన్ని గవర్నర్ మిశ్రా కు పంపించినట్లు తెలుస్తుంది.అయితే ఇప్పటికే రెండుసార్లు కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించిన గవర్నర్ ఇప్పుడు తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది.

మరోపక్క సచిన్ పైలట్ తో పాటు ఆయన మద్దతు దారులను అనర్హులుగా ప్రకటించగా దానిపై సచిన్ వర్గం కోర్టును ఆశ్రయించడం తో కోర్టు పైలట్ కు అనుకూలంగా తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.దీనితో రాజస్థాన్ రాజకీయాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది.

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయాల్లో సీఎం,గవర్నర్ ల మధ్య సైలెంట్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే రెండు సార్లు కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ కు పంపగా దానిని తిరస్కరిస్తూ సీఎం గెహ్లాట్ కు ఆరు పేజీలతో కూడిన లేఖ ను అందించారు.

దీనిపై మండిపడిన గెహ్లాట్ గవర్నర్ లవ్ లెటర్ రాశారు అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు.

అయితే తాజాగా మరోసారి గెహ్లాట్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ నెల 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అంటూ కీలక తీర్మానం చేశారు.

అయితే ఈ తీర్మానం పై గవర్నర్ ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి గెహ్లాట్ ను దెబ్బకొట్టాలి అని వేచి చూస్తుండగా ఇప్పుడు గవర్నర్ అంశం కూడా ఆయనకు తలనొప్పిగా మారింది.

ఈసారైనా గవర్నర్ సానుకూలంగా స్పందిస్తారా లేదంటే మునుపటిలాగే తిరస్కరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube