తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి సీరియస్..!

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది.కరోనా వైరస్ సమాచారాన్ని ప్రజలకు అందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినా ఎందుకు పాటించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.

 Telangana Government, High Court, Cm Kcr, Corona Details, Corona Positive Cases-TeluguStop.com

రాష్ట్రంలోని ఆస్ప్రతుల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి.ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయో వివరాలను తెలపాలని ఆదేశించింది.

అదే విధంగా ఎంతమంది చికిత్స పొందుతున్నారో ప్రతి రోజు న్యూస్ ఏజేన్సీ ద్వారా ప్రజలకు కరోనా సమాచారాన్ని తెలిపాలని ప్రభుత్వానికి ఆదేశించింది.హెల్త్ బులిటెన్‎లో తప్పుడు సమాచారం ఇస్తే ఉరుకోమని హైకోర్టు హెచ్చరించింది.

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్ప్రతులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు కరోనా సమాచారం ఇస్తామని సీఎస్ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సమాచార హక్కు కమిషనర్ అరవింద్‎కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.ప్రతి ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా ఉంచామని సీఎస్ కోర్టుకు విన్నవించారు.

కలెక్టర్లు, పోలీసులు, వైద్య అధికారులు నిరంతరం కరోనా నివారణ కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.ఇక మరోవైపు కరోనాపై ప్రభుత్వం ఎందుకు విస్తృత ప్రచారం చేపట్టడం లేదని ప్రశ్నించింది.

ప్రతి ఆస్పత్రి వద్ద ఎలక్ట్రానిక్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.ప్రతి ఆస్పత్రి వద్ద డీస్ల్పే బోర్డు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని సీఎస్ తెలిపారు.

HITM యాప్‎ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని.అందులో పూర్తి సమాచార ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రెండు లక్షల రాపిడ్ కిట్లు అందుబాటులో ఉండగా., మరో నాలుగు లక్షల కిట్లు ఆర్డర్ చేశామని సీఎస్ స్పష్టం చేశారు.రాపిడ్ కిట్లతో 40 శాతం మాత్రమే రిజల్ట్ కరెక్ట్‎గా వస్తుందని., దీంతో రాజస్ధాన్‎లో రాపిడ్ కిట్ల వాడకం ఆపేశారని హైకోర్టు ప్రభుత్వానికి గుర్తు చేసింది.

రాపిడ్ కిట్ల వాడకంపైర నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube