స్వపక్షంలో విపక్షంగా మారిన రఘురామకృష్ణంరాజు

అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణంరాజు పద్ధ తలనొప్పిగా మారిపోయారు.పార్టీ విధానాలు, పరిపాలనపై ఇప్పటికే చాలా సందర్భాలలో విమర్శలు చేసిన రఘురామకృష్ణంరాజుపై వైసీపీ తీవ్ర అసహనంతో ఉంది.

 Raghurama Krishnam Raju Headache To Ysrcp, Ap Cm Ys Jagan, Corona Effect, Corona-TeluguStop.com

ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అతని మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు.జగన్ కొంత మంది ఎమ్మెల్యేలని ఢిల్లీ పంపించి ఎంపీ మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ ని విన్నవించారు.

అలాగే విజయసాయి రెడ్డి మీద పేద షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు.వాటికి రఘురామ స్పందించకుండా కొత్త పాంయింట్స్ ని తెరపైకి తీసుకొచ్చి అధికార పార్టీ గొంతు నొక్కేశారు.

ఈ నేపధ్యంలో వైసీపీ అధిష్టానం అతని మీద అనర్హత వేటు కూడా వేయకుండా సైలెంట్ అయిపొయింది.ఇక దీనినే అవకాశంగా చేసుకొని ఎంపీ మరింతగా విమర్శల స్థాయి పెంచారు.

ఓ విధంగా చూస్తే రఘురామ వ్యవహారం స్వపక్షంలోనే విపక్షంలా తయారైంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

జగన్ పరిపాలనలో లోపాలని ఎత్తి చూపిస్తున్నారు.

అమరావతి రాజధాని విషయంలో, అలాగే కరోనా పరీక్షల విషయంలో తాజాగా విమర్శలు చేశారు.అదే సమయంలో విశాఖ రాజధానిపైన కూడా కీలక వాఖ్యలు చేశారు.

ప్రభుత్వ తీరుని అడుగడుగునా ఎండగడుతున్నారు.ఎలక్షన్ కమిషనర్ విషయంలో సుప్రీంకోర్టు కూడా అధికార పార్టీకి మొట్టికాయలు పెట్టడంతో దీనిపైన కూడా ఎంపీ విమర్శలు చేశారు.

న్యాయస్థానం ఆదేశాల్ని కూడా ప్రభుత్వం ధిక్కరించే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.ఇలానే ఉంటే ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారిని తరలించడానికి జగనన్న ప్రవేశ పెట్టిన అంబులెన్స్ లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.కరోనా కేసుల విషయంలో ఇప్పటికే ఏపీ మూడో స్థానంకి వచ్చేసిందని, భవిష్యత్తులో మొదటి స్థానంకి వెళ్లిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, కరోనాతో కలిసి సహజీవనం చేయాలి అనే మాటలు ఆపేసి కేసుల సంఖ్య మరింత పెరగకుండా నిలువరించే ప్రయత్నం చేయాలని అధికార పార్టీని కోరారు.

అధికారులలో కొంత అలసత్వం కనిపిస్తుందని, ప్రభుత్వం దీనిపై ద్రుష్టి పెట్టాలని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube