అమెరికా: ఇంటర్‌పోల్ వాషింగ్టన్ డైరెక్టర్‌గా భారత సంతతి అధికారి

భారత సంతతికి చెందిన న్యాయవాది ఉత్తమ్ ధిల్లాన్‌కు అమెరికాలో కీలక పదవి దక్కింది.ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ వ్యవస్థ ఇంటర్‌పోల్‌కు వాషింగ్టన్ డైరెక్టర్‌గా ఆయన నియమిస్తూ యూఎస్ అటార్నీ జనరల్ విలియం పి.

 Indian Origin Uttam Dhillon Named Interpol Washington Director,uttam Dhillon ,-TeluguStop.com

బార్ ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న వేన్ సాల్జ్‌గబెర్‌ రెండేళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకుని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి తిరిగి వచ్చారు.

ఇంటర్‌పోల్ వాషింగ్టన్ డైరెక్టర్‌గా ఉత్తమ్ .ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్‌లోని 194 సభ్య దేశాల్లో అమెరికా తరపున అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తారు.అంతర్జాతీయ స్థాయిలో నేర పరిశోధనలను పంచుకునేందుకు, మార్పిడి చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ధిల్లాన్ నాయకత్వం వహిస్తారు.

Telugu Generalwilliam, Indianorigin, Indian American, Uttam Dhillon-

భారత సంతతికి చెందిన ధిల్లాన్ గతంలో న్యాయశాఖ, వైట్ హౌస్, డీహెచ్ఎస్, కాంగ్రెస్, కెరీర్ ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు.జూలై 2, 2018న ప్రతిష్టాత్మక యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉత్తమ్ ధిల్లాన్ నియమితులయ్యారు.ఈ సమయంలో సుమారు 15 వేల మంది సిబ్బందిని నడిపించడంతో పాటు 3.2 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను పర్యవేక్షించారు.అంతకుముందు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ (ఐఏసీపీ) డైరెక్టర్ల బోర్డులోనూ ఉత్తమ్ పనిచేశారు.

అలాగే ఐఏసీపీ నార్కోటిక్స్ అండ్ డేంజరస్ డ్రగ్స్ కమిటీకి సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.డీఈఏలో చేరడానికి ముందు అమెరికా అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేశారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ స్కూల్ ఆఫ్ లా నుంచి ధిల్లాన్ న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు.శాన్‌డియాగోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి మనస్తత్వ శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని, శాక్రమెంటోలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి మనస్తత్వ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

విద్యాభ్యాసం తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా బార్‌‌లో ఆయన సభ్యత్వం పొందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube