పోలీసులను చూసి 35 మంది సముద్రంలో దూకారు, చివరికి!?

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తోంది కానీ ఈ కుర్రాళ్లను వణికించడం లేదు.దేశంలో వైరస్ విలయతాండవం చేస్తుంది.

 Corona Virus, Covid-19, Maharashtra, Beach, Youngsters-TeluguStop.com

ఈ వైరస్ భారీ నుండి బయట పడాలంటే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.అప్పుడే కరోనా వైరస్ కు బలి అవ్వము.

కానీ కొందరు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

మన వరకు వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

భయం కానీ బాధ్యత కానీ లేవు అనడానికి ఈ ఘటనే ఆదర్శం.కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న మహారాష్ట్రలో కొందరు యువకులు ఏకంగా క్రికెట్, బాస్కెట్ బాల్ తదితర ఆటలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర.

దీంతో ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా విధించింది.

అయితే ఆ కుర్రాళ్లు అవేమీ పట్టించుకోవడం లేదు.మాకోసం కాదులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

తాజాగా ముంబైలోని విరార్ ప్రాంతంలో గల అర్నాలా బీచ్‌లో సుమారు 35 మంది కుర్రాళ్లు క్రికెట్ ఆడుతూ కనిపించారు.వారందరిని అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించిన పోలీసులను చూసి ఆ 35 మంది ఒక్కసారిగా బీచ్‌లోకి దూకారు.

కొందరు ఈత కొడుతూ తప్పించుకోడానికి ప్రయతించిగా మరి కొందరు సముద్రంలో ఉన్న ఓ పడవ ఎక్కేసి పారిపోయారు.దీంతో పోలీసులకు కేవలం 14 మంది మాత్రమే దొరికారు.

స్థానిక గ్రామంలో నివసించే ఆ 14 మంది యువకులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.మిగతా కుర్రాళ్ల కోసం గాలిస్తున్నారు.

అయినా కరోనా వైరస్ సమయంలో అలాంటి ఆటలు ఎంత వరకు కరెక్ట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube