అట్టుడుకుతున్న అమెరికా...ఎంత ఘోరం..!!

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యా ఉదంతం ఎలాంటి పరిణామాలకి దారి తీసిందో తెలిసిందే.వేలాది మంది నల్ల జాతీయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేయడమే కాకుండా హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి.

 America Portland, Protests, Violent Riots, Anti Racism, Tear Gas,demonstrations,-TeluguStop.com

ఈ క్రమంలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి కూడా అయితే ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ నడుచుకున్న తీరు ఎన్నో విమర్సలకు దారి తీసింది.ఆ తరువాత ఈ ఉద్యమం మెల్ల మెల్లగా తగ్గుముఖం పట్టిందని అందరూ భావించారు.

అక్కడక్కడా నిరసనలు రేగినా పెద్దగా అవి ప్రభావితం కాలేదు.కానీ

అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ లో నల్లజాతీయులు ఫ్లాయిడ్ ఉదంతంపై మళ్ళీ నిరసనలు రేపారు.

పెద్ద ఎత్తున వచ్చిన నిరసన కారులు భారీ ప్రదర్శనగా వీధుల్లోకి వచ్చారు.దాంతో నిభందనలు అతిక్రమించినందుకు పోలీసులు వారితో వాగ్యుద్ధం చేశారు.

ఈ ఘటనతో నిరసన కారులు మరింత ఉద్రుతంగా ప్రవర్తించడంతో వారిపై పోలీసులు పెప్పర్ స్ప్రే లు జల్లారు, బాష్ప వాయువు కూడా ప్రయోగించారు.అయినా నిరసన కారులు వెనక్కి తగ్గక పోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఓ నిరసన కారుడు ప్రాణాలు కోల్పోయాడు.

Telugu Racism, George Floyd, Tear Gas, Riots-

ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనతో ఒక్క సారిగా మళ్ళీ జాత్యహంకార హత్యలపై నిరసనలు ఊపందుకున్నాయి.దాంతో భారీ ఎత్తున నిరసన కారులు రావడంతో ట్రంప్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఏజెంట్లు నిరసన కారులను అరెస్ట్ చేస్తున్నారు.మొత్తం ఇప్పటికి 45 మంది నిరసన కారులు అరెస్ట్ కాగా పలు నగరాలలో బందో బస్తులు ఏర్పాటు చేశారు అధికారులు.

అయితే చల్లారిపోయింది అనుకున్న నల్లజాతీయుల నిరసనలు మళ్ళీ రేగడంతో రిపబ్లికన్ పార్టీ ఆందోళన చెండుతున్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube